అన్యాయం యొక్క రకాలు

సోమ, 01/09/2023 - 17:36

అల్లాహ్ తప్ప మరొకరి సహాయం లేని వారి పట్ల అన్యాయం మరియు దుర్మార్గపు ప్రవర్తన గురించి సంక్షిప్త వివరణ... 

అన్యాయం యొక్క పరిణామాలు

హదీస్ గ్రంథాలలో ఇమామ్ బాఖిర్(అ.స) నుండి ఒక హదీస్ ఉల్లేఖించబడి ఉంది. వారు ఈ హదీస్ ను తన తండ్ర అయిన ఇమామ్ సజ్జాద్ నుండి మరియు వారు తమ తండ్రి అయిన సయ్యదుష్ షుహదా ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ(అ.స) నుండి వారు తమ తండ్రి అమీరుల్ మొమినీన్ హజ్రత్ అలీ(అ.స) నుండి ఈ రివాయత్ ను ఉల్లేఖించారు.[1]
ఈ రివాయత్ ను ఇమామ్ హుసైన్(అ.స) మరియు ఇమామ్ సజ్జాద్(అ.స) తమ జీవితం యొక్క చివరి నిమిషాలలో ఈ రివాయత్ ను తమ వసియ్యత్ రూపంలో తెలియపరిచారు. ఈ రివాయత్ ను నలుగురు పవిత్ర మాసూములు ఉల్లేఖించారు అయితే వారిలో ఇద్దరు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పే సందర్భం అనగా చివరి నిమిషాలలో తమ సంతానానికి వసియత్ చేశారు. నిజానికి ఆ వసియ్యత్ కేవలం తమ పిల్లలకు మాత్రమే కాదు షియాలందరికి చేసినట్లు ఇంకా చెప్పాలంటే మానవులందరికి చెబుతున్నట్లు. ఆ హదీస్ ఏమిటంటే:

“ఓ కుమారా! అల్లాహ్ తప్ప మరొకరి సహాయం లేని వారి పట్ల అన్యాయం నుండి దూరంగా ఉండు”.[2]
అత్యంత స్పష్టమైన ఉదాహారణ, ఇమామ్ హుసైన్(అ.స) మరియు వారి సహచరులది. అత్యంత నీఛమైన దుర్మార్గులు వారిని కష్టపెట్టారు. నిస్సహాయ స్థితిలో హతమార్చారు. ఆ తరువాత వారి కి సంబంధించిన వారిలో మిగిలిపోయిన మగాళ్లను, స్ర్తీలను మరియు పిల్లలను బంధీలుగా చేసుకున్నారు. ఆ ఎడారిలో, దాహం యొక్క అగ్ర స్థితిలో ఉండగా, అల్లాహ్ తప్ప మరొకడి సహాయం ఎరగని పరిస్థితిలో వారి పై దౌర్జన్యం చేశారు.

అన్యాయం ముఖ్యంగా ఎవ్వరూ లేని నిస్సహాయుల పట్ల దుర్మార్గం, ఇలాంటి దుర్మార్గనికి కొన్ని రకాలు ఉన్నాయి.

మొదటి రకం: ప్రపంచంలో ఉన్న దుర్మార్గాపు అధికారాలు నిస్సహాయపు ప్రజల పట్ల చేసే దుర్మార్గం మరియు అన్యాయం. రివాయతులనుసారం ఇలాంటి అధికారాలు చివరికి నాశనం అవుతాయి మరియు నామరూపాలు లేకుండా అంతమౌతాయి.

రెండవ రకం: కూలీల మరియు నౌకరుల పట్ల యజమానుల దౌర్జన్యం. ముఖ్యంగా క్రింద పని చేసేవాడు నిస్సహాయుడై ఉన్నప్పుడు, యజమాని మాట వినకపోతే తన పని కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు.
వేతనం గురించి రివాయతులలో చాలా తాకీదు చేయబడి ఉంది; దీని ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉల్లేఖించారు: “వారి(కూలీలు) చెమట ఆరక ముందే వారి వేతనాన్ని చెల్లించండి”[3]
ఎవరైతే వేతనం ఇవ్వడం లో కూలీల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్థారో వాడు శాపగ్రస్థుడు(మల్ఊన్) అని దైవప్రవక్త(స.అ) సూచించారు.[4] మరో రివాయత్ లో ఇలా ఉపదేశించారు: “ఇలాంటి వ్యక్తి యొక్క పుణ్యాలు చెరపబడతాయి మరియు నాశమవుతాయి, అతడు స్వర్గపు సువాసనను పీల్చలేడు”[5]

మూడవ రకం: భర్త, భార్య పట్ల లేదా భార్య, భర్త పట్ల అలాగే తల్లిదండ్రులు పిల్లల పట్ల లేదా పిల్లలు తల్లిదండ్రుల పట్ల అన్యాయంగా ప్రవర్తించడం. ఒక్కోసారి భార్య వెనకాముందూ ఎవ్వరూ ఉండరు భర్త చేసే దుర్మార్గానికి సహిస్తుంది. అలాగే భర్త నిస్సహాయంగా ఉండి తన పరువు కోసం భార్య అన్యాయాలను భరిస్తూ ఉంటాడు. ఇదే విధంగా తల్లిదండ్రులు లేదా పిల్లల విషయంలో కూడా జరుగుతుంది. వారికి అల్లాహ్ తప్ప మరొకరి సహాయం ఉండదు.

దుర్మార్గం నుండి దూరంగా ఉండడం ఎలా
మనిషి, ఇతర మనుషుల మంచి మరియు చెడు లక్షణాలను చాలా త్వరగా స్వీకరించేటువంటి జీవి, అందుచేత చేతనైనంతవరకు మంచివాళ్ళతోనే ఉండటానికి ప్రయత్నించాలి. చెడ్డవారి నుండి దూరంగా ఉండటమే మేలు, వారి స్నేహం నుండి కాపాడుకుంటు ఉండాలి, ఇలాంటి చెడు స్నేహం మరియు చెడు స్నేహితుల వల్ల ప్రజలు సిగ్గు పడతారు. ఖుర్ఆన్ ఉపదేశం: ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త(స.అ) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుండేది!”[ఫుర్ఖాన్:27]
ఒకవేళ మనిషి స్వర్గానికి వెళ్ళాలనుకున్నట్లైతే తప్పకుండా మంచి వారితో కలిసి ఉండాలి మరియు తన లోపల నుంచి అన్ని చెడు లక్షణాలను తీసివేయ్యాలి. ఖుర్ఆన్ ఉపదేశం: “సత్కార్యాలలో, అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి”[మాయిదహ్:02]
అల్లాహ్ మనల్ని చెడ్డవారి సహవాసం నుండి దూరంగా ఉంచి స్వర్గాన్ని మన నిలయంగా నిర్ధారించుగాక అని సర్వాధికారి అయిన అల్లాహ్ ను నిరంతరం వేడుకోవాలి.

రిఫరెన్స్
1. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, భాగం2, పేజీ331.
2. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, భాగం2, పేజీ331.
3. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, భాగం5, పేజీ288.
4. ఖాజీ నొఅమాన్, దఆయిముల్ ఇస్లాం, భాగం2, పేజీ74.
5. సదూఖ్, మన్ లా యహ్జురుహుల్ ఫఖీహ్, భాగం4, పేజీ3.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9