సూరయే ఇస్రా యొక్క 24వ ఆయత్ నుండి తెలుసుకోవలసిన కొన్ని అంశాల వివరణ.
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: అణుకువ, దయాభావం ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి(తల్లిదండ్రుల) ముందు అణచిపెట్టు. “ఓ ప్రభూ! బాల్యంలో వీరు నన్ను (ప్రేమానురాగాలతో) పోషించినట్లుగానే నీవు వీరిపై దయజూపు” అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండు.[ఇస్రా:24]
ఈ ఆయత్ నుండి మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలు:
1. పిల్లలు తన జీవితంలో ఎంత ఎదిగిపోయిన తల్లిదండ్రుల ముందు మాత్రం అణుకువగా ఉండాలి.
2. తల్లిదండ్రుల పట్ల అణుకువా దయాభావం, మనసులోతు నుండి అయి ఉండాలి, కేవలం పైపైకి లేదా ఆస్తి కోసం ఉండకూడదు.
3. తల్లిదండ్రుల పట్ల అణుకువగా ఉండడంతో పాటు “వారి పట్ల దయజూపు” అని అల్లాహ్ తో ప్రార్థించాలి.
4. తల్లిదండ్రుల పట్ల కొడుకు దుఆ అంగీకరించబడుతుంది.
5. వారి కోసం దూఆ, అల్లాహ్ ఆజ్ఞ మరియు వారి కృతజ్ఞతకు చిహ్నం.
6. అల్లాహ్ కారుణ్యం మాత్రమే తల్లిదండ్రుల శ్రమకు ప్రతిఫలం ఇవ్వగలడు. పిల్లలు వారి శ్రమకు పరిహారం చెల్లించలేరు.
7. చిన్నతనంలో, వారు ఎదురుకున్న కష్టాలను మరియు వారి శ్రమను ఎప్పటికీ మరవకూడదు.
8. తల్లిదండ్రులు ప్రేమగా పోషించాలి, వారి పట్ల దయ చూపించాలి.
9. మనిషి, అతడిని పోషించిన పోషకుల పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి.
వ్యాఖ్యానించండి