ఇస్లాం దృష్టిలో అణచివేయబడినవారు మరియు అన్యాయానికి గురి అయిన వారికి సహాయం చేయడం మరియు వారి తరపు నుండి పోరాడటం గురించి సంక్షిప్త వివరణ...

ఇస్లాం దృష్టిలో అణచివేయబడినవారు మరియు అన్యాయానికి గురి అయిన వారికి సహాయం చేయడం మరియు వారి తరపు నుండి పోరాడటం గురించి చాలా రివాయతలు ఉన్నాయి. దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “అన్యాయానికి గురి అయిన వారి హక్కులను దుర్మార్గుడి నుండి తిరిగి తీసుకున్నవాడు (అతడు ముస్లిం కానివ్వండి లేదా ఇస్లాం మేతరులు కానివ్వండి) స్వర్గంలో నాతో పాటు ఉంటాడు”[1] స్వర్గంలో చాలా మంది ఉండవచ్చు కాని స్వర్గస్థులందరికీ దైవప్రవక్త(స.అ)తో పాటు ఉండే భాగ్యం లభించదు కేవలం అన్యాయానికి గురి అయిన వారి కోసం న్యాయ పోరాటం చేసిన వాడికి తప్ప.
మరో హదీసులో దైవప్రవక్త(స.అ) ఇలా సెలవిచ్చారు: “అణచివేయబడిన వారు ముస్లిముల నుండి సహాయం కోరగా, అతడి సహాయానికి త్వరపడనివాడు ముస్లిం కాదు”[2] అణచివేయబడిన వాడు సహాయం కోరగా అతడికి సహాయం చేసే యోగ్యత ఉండి కూడా సహాయం చేయకపోతే అతడు ముస్లిం కాడు అని దైవప్రవక్త(స.అ) ఉపదేశించారు.
ఈ రివాయత్ కూడా ప్రతీ ఒక్కరికి వర్తిస్తుంది ఇందులో ముస్లిం మేతరులు కూడా ఉన్నారు.
హజ్రత్ అలీ(అ.స) తన ప్రియ కుమారులు ఇమామ్ హసన్(అ.స) మరియు ఇమామ్ హుసైన్(అ.స) లతో ఇలా అన్నారు: “దుర్మార్గుల పట్ల శత్రుత్వం మరియు అణచివేయబడిన వారి పట్ల మద్దత్తుదారుడిగా ఉండండి”[3] ఈ రివాయత్ కుడా ప్రత్యేకించి ముస్లిములకు మాత్రమే సహాయం తెలపండి మరియు ముస్లిం మేతరుల పట్ల శత్రుత్వ భావం కలిగి ఉండండి అని అనడం లేదు. ఇస్లాం ఆదేశాలనుసారం అన్యాయానికి గురి అయిన వారిక సహాయపడడం ప్రతీ ముస్లిం యొక్క కర్తవ్యం; అన్యాయానికి గురి అయిన వాడు ముస్లిం కాకపోయినా సరే.
ఇమామ్ సజ్జాద్(అ.స) అముల్యమైన గ్రంథం సహీఫయె సజ్జాదియహ్ 38వ దుఆలో ఇలా ఉపదేశించెను: “ఓ ప్రభువా! నీ ఆస్తానంలో ముగ్గురి పట్ల క్షమాపణ కోరుతున్నాను:
1. నా సన్నిధిలో అన్యాయానికి గురి అయి నేను అతడికి సహాయం చేయలేకపోయిన వారికి.
2. నాకు తన సేవలు అందించాడు కాని నేను అతడికి కృతజ్ఞత తేలుపుకోలేక పోయిన వారికి.
3. నా పట్ల తప్పుగా ప్రవర్తించి క్షమాపణ కోరినా నేను అతడి పశ్చాత్తాపాన్ని అంగీకరించని మనిషికి”.[4]
ఇమామ్ మొహమ్మద్ తఖీ(అ.స) ఈ విధంగా ప్రవచించారు: “దుర్మార్గుడు, దుర్మార్గుడికి సహాయపడేవాడు మరియు దుర్మార్గులను సమ్మతించేవారు, వీరందరు దుర్మార్గంలో పాత్రదారులే”[5].
ఈనాడు చేసే దౌర్జన్యాలు రేపటి అంధకారానికి కారణం అని అంటారు, దుర్మార్గులు ఈ లోకంలో వారు చేసే దౌర్జన్యాల వలన చరిత్రలో నిలిచిపోతారు మరియు ప్రళయదినాన అల్లాహ్ ఆగ్రహానికి గురవుతారు. ఎక్కడైతే ఇతరులపై అన్యాయం జరుగుతుందో అక్కడ మనము కూడా ఆ అన్యాయానికి ఎదురు తిరగాలి, ఒక వేళ అలా చేయలేక పోతే ఆ దుర్మార్గల చర్యల పట్ల సమ్మతాన్ని వ్యాక్తం చేయకూడదు, ఒక వేళ అది కూడా చేయలేక పోతే కనీసం అన్యాయానికి గురి అయినవారికి అండగా నిలబడాలి.
చరిత్రనుసారం; ఎవరైతే కర్బలా సంభవించినప్పుడు ఇమామ్ హుసైన్(అ.స) యొక్క శత్రువులకు గుర్రాలను, ఆయుధాలను, ధనాన్ని ఇచ్చి ఈ దుర్మార్గంలో వారికి తమ సహయాన్నీ అందించారో మరియు ఎవరైతే ఆ రోజు ఆ దౌర్జన్యాన్ని చూసి మౌనంగా ఉండి తన సమ్మతాన్ని వెళ్లడించారో, అందరూ ఆ దౌర్జన్యంలో భాగ్యస్వామ్యులే మరియు అల్లాహ్, ఆయన ప్రవక్త(స.అ) ఆగ్రహానికి గురయినవారే.
ఈ రోజు కూడా ఈ దౌర్జన్యాల పరంపర కొనసాగుతూ వస్తుంది, ముస్లిం దేశాలలో ముఖ్యంగా పాలస్తీనా, ఇరాక్, సిరియా, అఫ్ఘానిస్తాన్ వంటి దేశాలలో ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయి, వారి దౌర్జన్యాలకు విరుధ్ధంగా నిలబడటం ఒక ముస్లింగా మన బాధ్యత కాదా? ఇది ఆలోచించవలసిన విషయం...
ఇస్లాం ఆదేశాలను అనుచరిస్తూ అణచివేయబడిన మరియు అన్యాయానికి గురి అయినవారికి సహాయం అందించే ప్రతీ ఒకరికి అల్లాహ్ రక్షణ కల్పించుగాక...!
రిఫరెన్స్
1. కరాజకీ, మొహమ్మద్ ఇబ్నె అలీ, కన్జుల్ ఉమ్మాల్, మొహఖ్ఖిఖ్/ముసహెహ్., అబ్దుల్లాహ్, దారుజ్జఖాయిర్, ఖుమ్, 1410ఖ, చాప్1, భాగం1, పేజీ135.
2. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ, మొహఖ్ఖిఖ్/ముసహెహ్.. గఫ్ఫారీ, అలీ అక్బర్, ఆఖుంద్, మొహమ్మద్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, తహ్రాన్, 1407ఖ, చాప్4, భాగం2, పేజీ164.
3. షరీఫ్ అల్ రజీ, మొహమ్మద్ ఇబ్నె హుసైన్, నెహ్జుల్ బలాగహ్, మొహఖ్ఖిఖ్/ముసహెహ్.. సుబ్హీ సాలెహ్, హిజ్రత్, ఖుమ్, 1414ఖ, చాప్1, పేజీ421, నామె47.
4. ఇమామ్ సజ్జాద్(అ.స), సహీఫయె సజ్జాదియహ్, దుఆయె38.
5. అర్బలీ, అలీ ఇబ్నె ఈసా, కష్ఫుల్ ఘుమ్మహ్, 2వ భాగం, పేజీ348.
వ్యాఖ్యానించండి