రజబ్ మాసం ప్రాముఖ్యతను వెళ్లడిస్తూ ఉల్లేఖించబడిన హదీసులు మరియు రివాయతుల వివరణ...
రజబ్ మాసం ప్రాముఖ్యతను వెళ్లడిస్తూ ఉల్లేఖించబడిన హదీసులు మరియు రివాయతులు చాలా ఉన్నాయి. వాటి నుండి కొన్నింటిని ఇక్కడ మీ కోసం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: రజబ్ మాసం, అల్లాహ్ తరపు నుండి ఎన్నుకోబడ్డ మాసాలలో ఒకటి, అది అల్లాహ్ మాసం. రజబ్ మాసాన్ని గొప్పగా భావించినవారు అల్లాహ్ ఆదేశాన్ని గౌరవించినట్లే, మరి అల్లాహ్ ఆదేశాన్ని గౌరవించిన వాడిని అల్లాహ్ అనుగ్రహాలతో నిండి ఉన్న స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు....[1]
ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) ఉల్లేఖనం: నాలుగు రాత్రులను అల్లాహ్ ప్రార్థనకై పరిమితం చేసే మనిషిని నేను ఇష్టపడతాను, ఈదె ఫిత్ర్ రాత్రి, ఈదె ఖుర్బాన్ రాత్రి, షాబాన్ నెల రేపు 15వ తేది అనగ వచ్చే రాత్రి, రజబ్ మాసం యొక్క మొదటి రాత్రి(చంద్రదర్శనం చేసిన రాత్రి).[2]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం.. అల్లాహ్ ప్రతీ విషయం నుండి నాలుగు వాటిని ఎన్నుకున్నాడు.. దైవదూతల నుండి జిబ్రయీల్, మీకాయీల్, ఇస్రాఫీల్ మరియు ఇజ్రాయీల్ ను. పట్టణాలలో నాలుగు పట్టణాలు మదీనహ్, బైతుల్ ముఖద్దస్, కూఫహ్ మరియు మక్కాలను. నలుగురు స్ర్తీలను మర్యమ్, ఆసియహ్, ఖదీజహ్ మరియు ఫాతెమా. నాలుగు రోజులు జుమా, తర్వియహ్(జిల్ హిజ్ 8వ తేదీ), అరఫహ్ మరియు ఖుర్బానీ రోజు. నాలుగు వంశాలు ఆదమ్ వంశం, నూహ్ వంశం, ఇబ్రాహీమ్ వంశం మరియు ఇమ్రాన్ వంశం. నాలుగు నెలలు రజబ్, షవ్వాల్, జీఖఅదహ్ మరియు జిల్ హిజ్జహ్.
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: రజబ్ మాసాన్ని “కురిసే నెల” అని నామకరించారు. ఎందుకంటే ఈ నెలలో నా ఉమ్మత్ ప్రజల పై అతిగా అల్లాహ్ కారుణ్యం కురుస్తుంది.[3]
ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఉల్లేఖనం: రజబ్, పాలకన్నా తెల్లగా మరియు తేనె కన్నా తియ్యగా ఉండే స్వర్గపు సెలయేరు. రజబ్ మాసంలో ఒకరోజు ఉపవాసం ఉన్నా అతడికి అల్లాహ్ ఆ సెలయేరు నుండి త్రాగే భాగ్యాన్ని కలిగిస్తాడు.[4]
ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: రమజాన్ మాసం అల్లాహ్ ది, షాబాన్ మాసం దైవప్రవక్త[స.అ] ది, రజబ్ మాసం నాది.[5]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్, సప్తాకాశాలలో, దూతను నియమించాడు. వారిని “దాయి” అంటారు. రజబ్ మాసం రాగానే, ఆ మాసం యొక్క ప్రతి రాత్రి ఉదయం వరకు ఇలా పిలుస్తూ ఉంటారు: “స్మరించేవారికి శుభవార్త, విధేయతలకు శుభవార్త”
అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “నాతో కూర్చున్న వారితో నేనూ కూర్చుంటాను, నా పట్ల విధేయత చూపే వారికి నేనూ విధేయత చూపుతాను, నాతో క్షమాపణ కోరే వారిని క్షమిస్తాను. (ఈ) నెల, నా నెల, (ఈ) దాసుడు నా దాసుడు మరియు (ఈ) దయ నా దయ. ఈ మాసంలో నన్ను పిలిచినవాడికి సమాధానమిస్తాను, మరియు నన్ను కోరుకున్నవారి కోరికలను తీరుస్తాను, మరియు నా నుండి రుజుమార్గం కోరితె నేను అతడికి రుజుమార్గం చూపిస్తాను. ఈ మాసాన్ని నా మరియు నా దాసుని మధ్య సంబంధంగా నిర్ధారించాను. ఈ సంబంధం(త్రాడు)ను పట్టుకున్నవాడు నా వరకు చేరుకున్నట్లే”[6]
ఇంత మంచి మాసం మరియు ఇన్ని ప్రాముఖ్యతలు ఉన్న మాసంలో ప్రతీ విశ్వాసి ఇందులో తాను చేసుకున్న పాపములకు తౌబహ్ ద్వారా పశ్చాత్తాపం చెంది తన ఆత్మను శుద్ధి చేసుకునేందుకు మంచి అవకాశం అందుకు అల్లాహ్ మనందరికి ఈ మాసంలో తౌబహ్ చేసే యోగ్యత ప్రసాదించాలని కోరుకుందాం. ఆమీన్.
రిఫరెన్స్
1. ముత్తఖియే హిందీ, కన్జుల్ ఉమ్మాల్, భాగం12, పేజీ323, హదీస్35217.
2. మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం91, పేజీ123, హదీస్12, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.
3. మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం97, పేజీ39, హదీస్24, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.
4. మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం8, పేజీ175, హదీస్126, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.
5. మిస్బాహుల్ మతహజ్జిద్, పేజీ797
6. మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం98, పేజీ377, హదీస్1, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.
వ్యాఖ్యానించండి