రజబ్ నెలలో జరిగిన సంఘటనలు

సోమ, 01/08/2024 - 10:51

అరబిక్ క్యాలండర్ ప్రకారం 7వ నెల అయిన రజబ్, అందులో జరిగిన ముఖ్య సంఘటనల గురించి సంక్షిప్త వివరణ...

రజబ్ నెలలో జరిగిన సంఘటనలు

1వ తారీఖు
హిజ్రీ యొక్క 57వ సంవత్సరం హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) జన్మదినం. ఇమామ్ బాఖిర్(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క ఐదవ ఉత్తరాధికారి, ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క కుమారుడు. పేరు “ముహమ్మద్”, కున్నియత్ “అబూ జాఫర్”, బిరుదులు “బాఖిర్”, “బాఖిరుల్ ఉలూమ్”

ఇమామ్ బాఖిర్(అ.స) హిజ్రీ యొక్క 57వ ఏట మదీనహ్‌లో జన్మించారు. తల్లి “ఉమ్మె అబ్దుల్లాహ్” ఈమె ఇమామ్ హసన్(అ.స) కుమార్తె, ఈ విధంగా తల్లీ మరియు తండ్రి ఇద్దరి తరపు నుంచి ఇమామ్ బాఖిర్(అ.స) ఫాతెమీ మరియు అలవీ సంతానం. తండ్రి ఇమామ్ సజ్జాద్(అ.స) మరణించేటప్పుడు ఇమామ్ బాఖిర్(అ.స)కి 39 సంవత్సరాలు. 

వారి(అ.స) యొక్క ఇమామత్ కాలం 18 సంవత్సరాలు. హిజ్రీ యొక్క 114వ సంవత్సరంలో మదీనహ్ లో విషం ద్వార చంపబడ్డారు. వారి సమాధి వారి తండ్రి మరియు పితామహుల ప్రక్కలో “బఖీ” స్మశానంలో ఉంది.[1]

2వ తారీఖు(లేదా 5వ తారీఖు)
హజ్రత్ ఇమామ్ అలీయున్నఖీ(అ.స) జన్మదినం
దైవప్రవక్త(స.అ) పదవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ అలీ ఇబ్నె ముహమ్మద్ అల్ హాదీ(అ.స) 212 హిజ్రీలో సర్యా(మదీనహ్ పట్టణానికి దగ్గర)లో జన్మించారు. వారి తండ్రి హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ తఖీ జవాదుల్ ఆయిమ్మహ్(అ.స). వారి తల్లి పేరు సమానహ్. వారి పేరు అలీ. వారి బిరుదులు నఖీ, హాదీ, నజీబ్. మరియు వారి కున్నియత్ అబూల్ హసన్.

3వ తారీఖు
కొన్ని రివాయతుల ప్రకారం హిజ్రీ యొక్క 254వ సంవత్సరం “సామరా”లో హజ్రత్ ఇమామ్ అలీయున్నఖీ[అ.స] మరణించారు.

10వ తారీఖు
హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] జన్మదినం.
ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క 9వ ఉత్తరాధికారి. పేరు “ముహమ్మద్”, కున్నియత్ “అబూ జాఫర్”, బిరుదు “తఖీ” మరియు “జవాద్”, రమజాన్ మాసం హిజ్రీ 195వ సంవత్సరం మదీనహ్ పట్టణంలో జన్మించారు. తండ్రి ఇమామ్ రిజా(అ.స), తల్లి “సబీకహ్” ఈమె దైవప్రవక్త(స.అ) భార్య అయిన “మారియా ఖిబ్తియహ్” వంశానికి చెందివారు.
ఇమామ్ జవాద్(అ.స) యొక్క తండ్రి మరణించినపుడు వారు 8 సంవత్సరాల వయసు కలిగివున్నారు. 25 సంవత్సరాల వయసులో విషం ద్వార చంపబడ్డారు. వారి సమాధి బగ్దాద్ లో తన పితామహులైన ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ప్రక్కన ఉంది.

13వ తారీఖు
హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స)
దైవప్రవక్త(స.అ) బెఅసత్‌కు 10 సంవత్సరాల ముందు(హిజ్రత్ కన్న 33 సంవత్సరాల క్రితం) అల్లాహ్ గృహం అనగ కాబాలో హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) జన్మించారు. వారు నిత్యం దైవప్రవక్త(స.అ) ప్రక్కనే ఉండేవారు. దైవప్రవక్త(స.అ) మరణానంతరం వారు 30 సంవత్సరాలు జీవించి ఉన్నారు.

15వ తారీఖు
హిజ్రీ యొక్క 63వ సంవత్సరంలో జనాబె జైనబ్ బింతె అలీ[అ.స] మరణించారు. అరబీ భాషలో “జైనబ్” యొక్క అర్ధం మంచిదృశ్యంగల వృక్షం. అనగా మంచి మంచి సువాసనలతో, రసభరితమైన పండ్లూ, పూలతో నిండుగా ఉన్న వృక్షం, దానిని చూడగానే మనసుకు శాంతి కలుగుతుంది మరియు అది ప్రతీ మనిషికి లాభం చేకూర్చుతుంది. “జైనబ్” యొక్క పదానికి ఇంకో అర్ధం కూడా ఉంది అది “జైను అబ్” అనగా “తండ్రికి అలంకరణ”. ఈమె హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(స.అ) యొక్క ప్రియకుమార్తె.

హజ్రత్ ఇమామ్ అలీ(అ.స) మరియు సర్వలోకస్ర్తీల నాయకురాలు అయిన హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క కుమార్తె. స్వర్గయువకుల నాయకులైన ఇమామ్ హసన్ మరియు ఇమామ్ హుసైన్(అ.స), మరియు హజ్రత్ అబ్బాస్(అ.స) యొక్క చెల్లెలు. జనాబె జాఫరె తయ్యార్ మరియు అస్మా బింతె ఉమైస్ యొక్క కోడలు. త్యాగానికి మరియు ఔదార్యానికి మారు పేరు అయిన అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫర్ యొక్క భార్య.

25వ తారీఖు
హజ్రత్ ఇమామ్ మూసా కాజిమ్(అ.స) మరణించిన రోజు.
దైవప్రవక్త(స.అ) 7వ ఉత్తరాధికారి హజ్రత్ మూసా(అ.స). వారి బిరుదు కాజిమ్. తల్లి “హమీదహ్” తండ్రి హజ్రత్ సాదిఖ్(అ.స). ఇమామ్ మూసా కాజిమ్(అ.స) సఫర్ మాసం 7వ తేదీ హిజ్రీ యొక్క 128వ సంవత్సరంలో “అబ్వా” లో జన్మించారు. వారు రజబ్ మాసం, హిజ్రీ యొక్క 183వ సంవత్సరంలో 55 వయసులో హారున్ అల్ రషీద్ ఆదేశానుసారం విషం ద్వార చంపబడ్డారు. వారు బగ్దాద్(ఇరాఖ్) లో ఉన్న “కాజిమైన్” పట్టణంలో సమాధి చేయబడ్డారు.

27వ తారీఖు
హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా(స.అ) యొక్క బెఅసత్ రోజు.
హజ్రత్ ముహమ్మద్(స.అ) ఎల్లప్పుడు “హిరా” అనే గుహలో ప్రార్దన చేసేవారు. ఒకరోజు హజ్రత్ ముహమ్మద్(స.అ) ప్రార్దన చేస్తుండగా జనాబె జిబ్రయీల్(అ.స) వచ్చి “ఓ ముహమ్మద్(స.అ)! అల్లా మిమ్మల్ని ప్రవక్తగా ఎన్నుకొనెను” అని అన్నారు.

హజ్రత్ ముహమ్మద్(స.అ), ప్రవక్త అయిన తరువాత “గారేహిరా”నుండి బయటకు వచ్చినప్పుడు చెట్లు చేమలు, రాళ్ళు రప్పలు, మరియు ప్రకృతిలోని ప్రతి జీవీ ఆయనకు “అస్సలాము అలైక యా నబీయల్లాహ్, అస్సలాము అలైక యా రసూలల్‌ల్లాహ్” అని సలాములు చేశాయి. హజ్రత్ ముహమ్మద్(స.అ), ప్రవక్త అయిన తరువాత మగవారిలో మొట్ట మొదటగా హజ్రత్ అలీ(స.అ) వారి పై ఈమాన్ తెచ్చారు.[2]

28వ తారీఖు
హజ్రత్ ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ(అ.స) మదీనహ్ నుండి తన కుటుంబ సభ్యులతో ప్రయాణం మొదలు పెట్టారు. (ఫజీలతె మాహె రజబ్ వ మునాసిబత్ హాయే మొహిమె ఆన్, పేజీ26.) అప్పటి మదీనహ్ అధికారి(వలీద్ ఇబ్నె ఉత్బా)కి, ముఆవియహ్ మరణించిన తరువాత ఇమామ్ హుసైన్(స.అ) నుంచి యజీద్ ఖిలాఫత్ కై బైఅత్ ను తీసుకోమని ఆదేశం వచ్చింది. ఇమామ్ ఇలా అన్నారు: “యజీద్ మద్యం సేవిస్తాడు, అన్యాయంగా రక్తం చిందించే దుర్మార్గుడు, అవినీతిని పెంచేవాడు, అతడి చేతులు అమాయకుల రక్తంతో తడిచివున్నాయి. ఇలాంటి వ్యక్తితో నాలాంటి వ్యక్తి బైఅత్ చేయడు”
మర్వాన్ ఇబ్నె హకమ్ ఇమామ్ నుంచి యజీద్ కోసం బైఅత్ ను కోరినప్పుడు ఇమామ్ హుసైన్(స.అ) ఇలా అన్నారు: “ఓ అల్లాహ్ శత్రువా! నా నుంచి దూరమవ్వు, నేను దైవప్రవక్త(స.అ)ను ఇలా చెబుతుండగా విన్నాను: ‘ఖిలాఫత్ అబూసుఫ్యాన్ సంతానం పై నిషేధం, ఒకవేళ ముఆవియహ్ ను నా పీఠంపై కూర్చోవడం చూస్తే వాడిని చంపేయండి’ వారి ఉమ్మత్ అతడిని ఇలా (అవ్వడాన్ని) చూసింది కాని దాని పై అమలు చేయలేదు. ఇక ఇప్పుడు అల్లాహ్ వాళ్లను అవినీతి పరుడైన యజీద్ ను వారికి గురిచేశాడు”.
ఇమామ్ హుసైన్(అ.స) హిజ్రీ 60వ సంవత్సరం, రజబ్ మాసం 28వ తేది రాత్రి(ఉదయం అయితే 28వ తేది అనగ) కుటుంబ సభ్యులు మరియు కొందమంది సహచరులతో పాటు, దైవప్రవక్త(స.అ) సమాధిని వీడ్కోలు చెప్పి మదీనహ్ నుంచి మక్కాకు బయలుదేరారు.

రిఫ్రెన్స్
1. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మన్షూరాతు మక్తబతు బసీరతీ, పేజీ261.
2. షేక్ అబ్బాస్ ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, దైవప్రవక్త(స.అ)కు సంబంధించిన అధ్యాయంలో.
హౌజా నెట్. ఫజీలతె మాహె రజబ్ వ మునాసిబత్ హాయే మొహిమె ఆన్, పేజీ26.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24