మనిషి అర్ధరహితంగా సృష్టించబడలేదు

గురు, 12/28/2017 - 15:21
మనిషి అర్ధరహితంగా సృష్టించబడలేదు

మనిషి తన ప్రతీ పనికి దేవుని దగ్గర జవాబుదారుడు, ఇప్పుడు కృతజ్ఞుడిగా వ్యవహరించి మంచి కార్యములు చేయాలో లేదా కృతఘ్నుడిగా ఆ అల్లహ్ ఆజ్ఞను వ్వతిరేకించి పాపాల బారిన పడాలో మనిషి ఇష్టం.
అల్లాహ్ తన పవిత్ర గ్రంధంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు:
أفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ
"మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా(అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా?" [మోమినూన్/115]
వేరే చొట ఈ విధంగా సెలవిస్తున్నాడు:
أَيَحْسَبُ الْإِنسَانُ أَن يُتْرَكَ سُدًى
ఏమిటీ, తనను ఇట్టే వదలిపెట్టడం జరుగుతుందని మానవుడు అనుకుంటున్నాడా?[అల్-ఖియమత్/36]
ఈ ఆయతుల విష్లేషన ద్వార తెలిసేదేమిటంటే మనిషి వృధాగా సృష్టించబడలేదు ఎదో ఒక ఉద్దేశంతోనే స్రుష్టించబడ్డాడు, దానినే వర్ణిస్తూ దైవఖురాన్ నాలుగు కారణములను ప్రస్తావిస్తుంది:
1. పరిక్ష నిమిత్తం:
ٱلَّذِى خَلَقَ ٱلْمَوْتَ وَٱلْحَيَوٰةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًۭا ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْغَفُورُ
మీలో మంచిపనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృష్టించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను.[అల్-ముల్క్/2]
2. ఏకేశ్వరవాదాన్ని తెలుపుటకు:

ٱللَّهُ ٱلَّذِى خَلَقَ سَبْعَ سَمَٰوَٰتٍۢ وَمِنَ ٱلْأَرْضِ مِثْلَهُنَّ يَتَنَزَّلُ ٱلْأَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ وَأَنَّ ٱللَّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَىْءٍ عِلْمًۢا.
అల్లాహ్‌-ఆయనే సప్తాకాశాలనూ, అలాంటివే భూములను సృష్టించినవాడు. ఆయన ఆజ్ఞ వాటి మధ్య అవతరిస్తుంది. అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడనీ, ఇంకా అల్లాహ్‌ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్ఠించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి[అత్-తలాఖ్/12].
3. దైవారాధన నిమిత్తం:
وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلْإِنسَ إِلَّا لِيَعْبُدُون

నేను జిన్నాతులను, మానవులను సృష్టించినదివారు నన్ను ఆరాధించటానికి మాత్రమే[అజ్-జారియాత్/56].
4. దేవుని కృపను పొందుట కొరకు:

الَّا مَن رَّحِمَ رَبُّكَ ۚ وَلِذَٰلِكَ خَلَقَهُمْ ۗ وَتَمَّتْ كَلِمَةُ رَبِّكَ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ ٱلْجِنَّةِ وَٱلنَّاسِ أَجْمَعِين
కాని నీ ప్రభువు దయచూపినవారు మాత్రం అలా చేయరు. ఆయన వారిని పుట్టించిందే అందుకోసం. ''నేను నరకాన్ని జిన్నాతులు, మనుషులు అందరితోనూ నింపుతాను'' అని నీ ప్రభువు అన్నమాట నెరవేరింది.[హూద్/119].

 

 

  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11