కారణ జన్ముడు

సోమ, 01/22/2024 - 14:53

ధన్య జన్ముడు మరియు ఆశీర్వాదాలతో జన్మించిన వారు అని ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) ఎందుకు అంటారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ... 

కారణ జన్ముడు

ఇమామ్ అలీ రిజా(అ.స) నుండి తన కుమారుడు హజ్రత్ మొహమ్మద్ తఖీ(అ.స) ఆశీర్వాదం మరియు శుభం కలిగివున్నటువంటి(ధన్యులు) వారు అని అనేవారు అని చాలా రివాయతులు ఉల్లేఖించబడి ఉన్నాయి. వారికి ఈ బిరుదు ఇవ్వడానికి గల కారణం; ఇమామ్ రిజా(అ.స)కు 40 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు దాని వల్ల వాఖిఫియహ్ సమూహం వారు వారి ఇమామత్ ను నిరాకరించారు, వాళ్లు ఇమామ్ రిజా(అ.స)కు సంతానం లేకపోవడాన్ని ఇమామత్ నిరాకరణానికి సాకుగా ప్రదర్శించారు. కాని అది ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) జన్మించడంతో అంతం అయ్యింది. ఇమామ్ రిజా(అ.స) మరియు వారి షియాలు ఏ ఒత్తిళ్లకు గురి అయి ఉన్నారో వాటి నుండి విముక్తి పొందారు.

అబుల్ యహ్యా సనఆనీ ఇలా అనెను: మేము ఒకరోజు ఇమామ్ రిజా(అ.స) యొక్క సన్నిధికి చేరాము అక్కడ ఇమామ్ అలీ రిజా(అ.స) ను అరటి పండును ఒలిచి తన కుమారులు అబూజాఫర్ ను తినిపిస్తున్నారు నేను వారితో ఇలా అన్నాను, ఇతనేనా ఆ ధన్యుల రూపంలో జన్మించిన పిల్లాడు2. ఇమామ్ అలీ రిజా(అ.స) ఇలా ఉల్లేఖించారు: “ఔను ఈ నవజాత శిశువుకు మించిన ధన్యుడు నా షయాల కోసం పుట్టలేదు”[1]

అంటే ఇమామ్ అలీ రిజా(అ.స) వివిధ సందర్భాలలో తన కుమారుడు ముహమ్మద్ తఖీ(అ.స) ను ఈ బిరుదుతో గుర్తు చేశారన్నమాట, అందుకే ఇది ఇమామ్ అలీ రిజా(అ.స) షియా మరియు సహచరలలో మరియు వారిని ఇష్టపడేవారి మధ్య చాలా ప్రఖ్యాతి చెందినది.

ఇబ్నె అస్బాత్ మరియు ఉబ్బాద్ ఇబ్నె ఇస్మాయీల్ అనే బడే ఇద్దరు షియాలు ఉల్లేఖనుసారం; మేము ఇమామ్ అలీ రిజా(అ.స) సన్నిధిలో ఉండగా అబూజాఫర్ ను తీసుకొచ్చారు, మేము వీరేనా ధన్యలుగా జన్మించినవారు? అని ప్రశ్నించాము. అందుకు ఇమామ్ రిజా(అ.స) ఇలా సమాధానమిచ్చారు: ఔను, వీరేవారు, ఇస్లాంలో వీరికి మించిన ధన్య జన్మ కలిగి వున్నవారు పుట్టలేదు.[2]

చూడగానే ఈ హదీస్ ద్వార బహుశ ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) పూర్వపు పవిత్ర మాసూముల(అ.స) కు మించిన ధన్యులు అని అనుకోవచ్చు కాని ఈ ఆలోచన సరి కాదు ఎందుకంటే సందర్భము మరియు సంబంధాలనుసారం ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) జన్మించిన సమయం అప్పటి షియాల కోసం శుభం మరియు ఆశ్వీర్వాదంతో కూడి ఉండింది, ఇమామ్ అలీ రిజా(అ.స) కాలంలో వారి తరువాత వారి ఇమామత్ అధికారం ఎవరికి దక్కుతుంది అన్న విషయాలలో ఉన్నారు. దీనికి మరియు ఇతర పవిత్ర మాసూములకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవైపు ఇమామ్ మూసా కాజిమ్(అ.స) యొక్క మరణం తరువాత “వాఖిఫియా” సమూహం పుట్టుకొని రావడం మరియు వారు ఇమామ్ రిజా(అ.స) యొక్క ఇమామత్ ను నిరాకరించడం మరియు మరో వైపు ఇమామ్ రిజా(అ.స) వయసు నలభై సంవత్సరాలు అయినా ఇంకా సంతానం కలగకపోవడం. అయితే దైవప్రవక్త(అ.స) నుండి నా తరువాత నా ఉత్తరాధికారులు మరియు ఇమాముల సంఖ్య 12 మరియు వారిలో 9 మంది ఇమామ్ హుసైన్(అ.స) సంతానానికి చెందినవారు అయి ఉంటారు అని ముతవాతిర్ మరియు మోతబర్ హదీస్ రూపంలో ఉల్లేఖించబడి ఉంది. దీని వలనే ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) జన్మించడం షియాల కోసం ధన్యపుట్టుక అని చెప్పడం జరిగింది.[3].

రిఫరెన్స్
1. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, పేజీ319; తబర్సీ, అఅలాముల్ వరా, పేజీ347; కులైనీ, ఉసూలే కాఫీ, భాగం1, పేజీ321; అలీ ఇబ్నె ఈసా అర్బలీ, కష్ఫుల్ గుమ్మహ్, భాగం3, పేజీ143.
هذَا المَولُودُ الّذي لَم يُولَد مَولُودٌ أعظَمُ بَرَكَةً عَلى شيعَتِنا مِنهُ
2. మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం50, పేజీ20; కులైనీ, ఫురూయె కాఫీ, భాగం6, పేజీ361.
3. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, పేజీ318; అలీ ఇబ్నె ఈసా అర్బలీ, కష్ఫుల్ గుమ్మహ్, భాగం3, పేజీ142.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18