ఉమ్ముల్ బనీన్[అ.స] యొక్క మొదటి రోజు ఇమామ్ అలీ[అ.స] ఇంట్లో

శుక్ర, 03/02/2018 - 07:02

.ఉమ్ముల్ బనీన్[అ.స] ఇమామ్ అలీ[అ.స] ఇంటికి వచ్చిన తరువాత ఏమి చేశారు. వారు పేరు ఉమ్ముల్ బనీన్ అని ఎందుకు పెట్టారు.

ఉమ్ముల్ బనీన్[అ.స] యొక్క మొదటి రోజు ఇమామ్ అలీ[అ.స] ఇంట్లో

ఉమ్ముల్ బనీన్[అ.స] ఇమామ్ అలీ[అ.స] ఇంట్లో మొదటి అడుగు పెట్టిన రోజున, ఇమామ్ హసన్ మరియు ఇమామ్ హుసైన్[అ.స] ఇద్దరూ అనారోగ్యంతో ఉన్నారు. వారి మంచం పై విశ్రాంతి తీసుకుంటున్నారు. అబూతాలిబ్ కోడలు ఇంటికి వచ్చీ రాగానే వారిద్దరి వద్దకు వెళ్ళారు, కన్న తల్లిలా వారితో ప్రేమగా మసలుకొని వారికి సేవలు చేశారు.
ఫాతెమా కలాబియహ్, ఇమామ్ అలీ[అ.స] తో కొంత కాలం గడిపిన తరువాత, అతనితో నన్ను నా అసుల పేరు ..ఫాతెమా.. కు బదులు ఉమ్మలు బనీన్ అని పిలవమని కోరారు. ఎందుకంటే హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] పిల్లలు ఆమె అసలు పేరు తమ తండ్రి నోట వింటే వారికి తమ తల్లి ఫాతెమా జహ్రా[స.అ] గుర్తుకు రావచ్చు, అలా వారికి జరిగిన సంఘటనుల గుర్తుకు రావచ్చు, మరియు తల్లి లేని బాధ కలగవచ్చు. ఇలా అవ్వకూడదని అనుకుంటున్నాను. అని అన్నారు.
ఉమ్ముల్ బనీన్ ప్రవర్తన ఫాతెమా జహ్రా[స.అ] సంతానం కోసం ఆమె లేని లోటును తీర్చేసింది. పిల్లలు ఉమ్ముల్ బనీన్[అ.స] లో తమ తల్లి ఫాతెమా జహ్రా[అ.స] ను చూసేవారు. ఉమ్ముల్ బనీన్, దైవప్రవక్త[స.అ] కుమార్తె పిల్లలను తన పిల్లల కన్న ఎక్కవగా ప్రేమించేవారు, మరి ఇలా చేయడం ధర్మకర్తవ్యంగా భావించే వారు. ఎందుకంటే అల్లాహ్ తరపు నుండి పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో వారి పట్ల ప్రేమగా ఉండమని ఆదేశం కూడా ఉంది కాబట్టి.[ఉమ్ముల్ బనీన్ బానూయే మర్ద్ ఆఫరీన్, పేజీ50,]         

రిఫ్రెన్స్
ఉమ్ముల్ బనీన్ బానూయే మర్ద్ ఆఫరీన్, పేజీ50, మజల్లాహ్, గుల్ బర్గ్, ముర్దాద్ 1382, షుమారహ్41.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12