ఉజూ కు సంబంధించి కొన్ని సూత్రల సంక్షిప్త వివరణ...
ఉజూ కు సంబంధించి కొన్ని సూత్రలు తెలుసుకోవడం మంచిది అని భావిస్తూ ఇక్కడ మీ కోసం వివరిస్తున్నాము.
మొదటి సూత్రం
ఒకడు ఉజూ చేశాడు ఆ తరువాత అతడికి తన ఉజూలో సందేహం కలిగింది (ఉజూను భంగం చేసే ఏడు అంశాల నుండి) ఏదో ఒక దానితో భంగం అయ్యిందా లేక నేను ఉజూ తోనే ఉన్నానా? అన్న విషయంలో సందేహం కలిగింది అయితే అతడు ఉజూ తోనే ఉన్నట్లు (భావించాలి).
ప్రశ్న: ఉదాహారణ!
సమాధానం: నువ్వు ఉదయం ఉజూ చేశావు, అప్పుడు నీకు నమ్మకం ఉంది (ఉజూతో ఉన్నావని), ఆ తరువాత జోహ్ర్ నమాజ్ సమయం అయ్యింది అప్పుడు నువ్వు నమాజ్ చదవాలనుకున్నావు అప్పుడు నీకు సందేహం కలిగింది నా ఉజూ కు భంగం కలిగించే పనేమైనా చేశానా లేదా అని, అప్పుడు నువ్వు నేను ఉజూతోనే ఉన్నాను అని భావించి నమాజ్ ను చదువుకోవాలి.
రెండవ సూత్రం
ఒకడు ఉజూ చేశాడు లేదా చేయలేదు, ఉజూను భంగం చేసే అంశాల నుండి ఏదో ఒకటి సంభవించింది మరియు ఉజూ భంగం అయ్యింది, ఆ తరువాత మరలా ఉజూ చేశానా లేదా? విషయంలో సందేహం కలిగింది. అప్పుడు అతడు ఉజూతో లేనట్టు అతడు నమాజ్ చదవాలంటే ఉజూ చేసుకోవాలి.
ప్రశ్న: ఉదాహారణతో వివరించండి!
సమాధానం: ఉదయాన్నే నువ్వు నిద్ర లేచావు, జోహ్ నమాజ్ సమయం వచ్చింది, నమాజ్ చదవాలనుకున్నావు, అప్పుడు నీకు సందేహం కలిగింది నేను ఉదయం నిద్ర నుండి లేచి ఉజూ చేశానా లేదా అని సందేహం కలిగింది, అప్పుడు నువ్వు ఉజూ తో లేను అను భావించాలి మరియు ఉజూ చేసి నమాజ్ చదవాలి.
మూడవ సూత్రం
ఒకడు ఉజూ చేశాడు మరియు ఉజూ పూర్తయిన తరువాత ఉజూ సరిగా చేశానా లేదా అన్న విషయంలో సందేహం వచ్చింది అప్పుడు అతడు ఉజూ సరిగానే చేశాను అని భావించాలి.
ప్రశ్న: ఉదాహారణ ఇవ్వండి!
సమాధానం: ఉదాహారణకు నువ్వు ఉజూ చేశావు, ఆ తరువాత నేను నా ముఖం కడిగానా లేదా? , లేక నేను నా ముఖాన్ని సరిగా కడిగానా లేదా? అన్న విషయంలో సందేహం కలిగితే అప్పుడు నువ్వు నీ ఉజూ సరైనదే అని భావించాలి.
ప్రశ్న: ఒకవేళ నేను నా ఎడమ కాలు మస్‌హ్ లో సందేహిస్తే ఏమి చేయాలి?
సమాధానం: నువ్వు మస్‌హ్ ను మరలా చేయి అయితే ఒకవేళ నువ్వు తరువాత చర్యలో ప్రవేశించి ఉంటే ఉదా: నువ్వు నమాజ్ మొదలు పెట్టేశావు లేదా మువాలాత్ గురించి సందేహం కలిగింది, అలాంటప్పుడు నీకొచ్చిన సందేహన్ని పట్టించుకోకూడదు.
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి