దయనీయ పితామహులు!

శని, 03/31/2018 - 11:56

మహనీయ ప్రవక్త[స.అ.వ]  ప్రవచనానుసారం,వారు మరియు అలి[అ.స] ఈ సమాజం యొక్క పితామహులు వారి యొక్క ఆజ్ఞపాలన మన కర్తవ్యం.

దయనీయ పితామహులు!

హదీసులలో తండ్రుల యొక్క రెండు రకములు ప్రస్థావనకు వచ్చాయి,ఒకటి మనకు జన్మనిచ్చె వాడు రెండు మనకు ఆధ్యాత్మిక మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతకు కారణమైనవాడు,మహనీయ ప్రవక్త ఈ విధంగా ఉల్లేఖించారు:
قال رسول اللہ صلی اللہ علیه و آله: "أَنَا وَ عَلِی أَبَوَا هَذِهِ الْأُمَّه
అనువాదం: "నేను మరియు అలి[అ.స] ఈ సమాజం యొక్క తండ్రులము".
హిజ్రి యొక్క 11వ సంవత్సరములో సఫర్ మాసపు 9వ తారీకున [అనగా మహా ప్రవక్త ఈ లోకాన్ని విడిచి వెళ్ళటానికి పంతొమ్మిది రోజులు ముందు] ఇమాం అలి[అ.స]ల వారు మహాప్రవక్త ఆదేశానుసారం వారి యొక్క ఉపదేశాన్ని ప్రజలకు వినిపించటానికి మస్జిదుకు విచ్చేసారు,మింబరు[మస్జిదులో ఉండే గద్దె] పైకి వెళ్ళి ప్రజలతో సంభోదిస్తూ ఈ విధంగా పలికారు:
“తెలుసుకోండి! ఎవరైతే తమ తల్లితండ్రుల ఆఖ్[అసహ్యించుకునేలా చేయటం] కు గురవుతారో వారిపై అల్లాహ్ యొక్క సాపం కలుగును,తెలుసుకోండి! ఎవరైతే తమ మౌలా[స్వామి] యొక్క ఆజ్ఞపాలన చేయరో వారు కూడా అల్లాహ్ పాపానికి గురవుతారు,తెలుసుకోండి! ఎవరైతే కార్మికుల వేతనాన్ని చెల్లించరో వారు కూడా అల్లాహ్ సాపానికి అర్హులవ్వక తప్పదు”.
అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్,హజ్రత్ అలి[అ.స]ల వారితో దీనికి ఏమైనా వివరణ ఉన్నదా?అని ప్రశ్నించెను,దానికి ఇమాం అలి[అ.స]ల వారు, “దీని వివరణ గురించి ఆ అల్లాహ్ మరియు అతని ప్రవక్తకు తెలుసు” అని పలికారు.
అందరు కలిసి మహనీయ ప్రవక్త[స.అ.వ] ల వద్దకు వెళ్ళి వారితో దీని గురించి వివరణ కోరగా,మహా ప్రవక్త[స.అ.వ]ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: “ఎవరైతే తమ తల్లి తండ్రులను అవమాన పరుస్తారో వారిపై అల్లాహ్ యొక్క శాపము కలుగును నేను నా దేవుని మరియు మిమ్మల్ని సాక్షిగా చేసి చెప్తున్నాను, అలి[అ.స] మరియు నేను విశ్వాసుల యొక్క తండ్రులము,ఎవరైతే మాలో ఏ ఒక్కరి గురించి అయినా చెడుగా మాట్లాడినా వారిపై అల్లాహ్ శాపము కలుగును”.

రెఫరెన్స్
బిహారుల్ అన్వార్,అల్లాం మజ్లిసి,40వ భాగం,పేజీ నం:45.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9