జనాబె జైనబ్[స.అ] వివాహం

సోమ, 04/02/2018 - 13:34

జనాబె జైనబ్[స.అ] యొక్క వివాహం పట్ల ఆమె తండ్రి తీసుకున్న జాగ్రత్తలు.

జనాబె జైనబ్[స.అ] వివాహం

ఇమామ్ హుసైన్[అ.స] లాంటి పవిత్ర ఇమామ్, ఖుర్ఆన్ పారాయణాన్ని వదిలి నిలబడి గౌరవిచేటువంటి వ్యక్తి పేరు జనాబె జైనబ్[అ.స]. మరి అలాంటి ప్రతిష్టతగల ఈమెకు జీవితాంతం తోడుగా ఉండేందుకు మరో వ్యక్తిని ఎన్నుకునే విషయం కూడా చాలా ముఖ్యమైనదౌతుంది. వచ్చే వ్యక్తిలో కూడా అవే గుణాలు అవే లక్షణాలు అదే స్వభావం అవే ప్రతిష్టతలు ఉండాలి.
చరిత్ర మరియు రివాయత్ల ద్వార తెలిసే విషయమేమిటంటే దైవప్రవక్త[స.అ] యొక్క మిత్రులు, బంధువులు, సహాబీయులు మరియు చాలా మంది ఫాతెమా జహ్రా[స.అ] కోసం వివాహసంబంధాలు తీసుకొచ్చారు, దైవప్రవక్త[స.అ] “ఈ సమస్యను అల్లాహ్ పరిష్కరిస్తాడు” అని అంగీకరించలేదు. మరి హజ్రత్ అలీ[అ.స] తరపు నుండి కబురు వచ్చినప్పుడు గౌరవంగా అంగీకరించారు మరియు ఇలా అన్నారు: “అలీ లేకుంటే ఫాతెమాకు సరైన వాడు ఉండేవాడు కాదు”. మరి ఇదే విధంగా హజ్రత్ జైనబ్[అ.స] వివాహ సమస్య వచ్చినప్పుడు కూడా హజ్రత్ అలీ[అ.స] యొక్క మిత్రులు, బంధువులు మరియు సహాబీయులు ముందుకొచ్చి వారి మనసులో ఉన్న మాటను చెప్పారు కాని అలీ[అ.స] వారి కోరికను అంగీకరించే వారు కాదు. ఎప్పుడైతే అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫరె తయ్యార్ యొక్క కబురు వచ్చిందో హజ్రత్ అలీ[అ.స] చాలా గౌరవంగా అంగీకరించారు. ఇదీ హజ్రత్ ముహమ్మద్[స.అ] మరియు హజ్రత్ అలీ[అ.స]లో ఉన్న నైపుణ్యం మరియు అంతర్ దృష్టి, వారు వివాహం విషయంలో ధర్మనిష్టా, గౌరవం, జ్ఞానం, వివేకం లాంటివే చూశారు. హజ్రత్ అలీ[అ.స] కూడా హజ్రత్ జైనబ్[అ.స] యొక్క మెహ్ర్(ఓలి) తన భార్య హజ్రత్ ఫాతెమా[అ.స] యొక్క మెహ్ర్ కు సమానంగా ఇచ్చారు.
 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31