జుహా సూరహ్

సోమ, 04/16/2018 - 17:10

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 93వ సూరహ్ అయిన “జుహా”(“దుహా”) సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

జుహా సూరహ్

ఖుర్ఆన్ యొక్క 93వ సూరహ్ ఇది. “జుహా”(“దుహా”) అనగ కాంతి, వెలుగు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “జుహా” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 7 సార్లు(“జుహా” అని 3 సార్లు, “జుహాహా” అని 3 సార్లు మరియు “తజ్హా” అని 1 సారి) వచ్చింది. ఈ సూరహ్ లో 11 ఆయత్‍లు, 40 పదాలు మరియు 165 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఫజ్ర్” సూరహ్ మరియు దీని తరువాత “ఇన్షిరాహ్” సూరహ్ అవతరించబడ్డాయి. “జుహా” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ “జుహా” అన్న పద్దంతో మొదలవ్వడం. ఈ సూరహ్ యొక్క ప్రత్యేకత, వహీ అవతరణ క్రమం మరలా ఈ సూరహ్ ద్వారానే మొదలయ్యింది. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను “ఏ వ్యక్తి అయితే “జుహా” సూరహ్ ను పఠిస్తాడో అల్లాహ్ అతడిని స్వీకరిస్తాడు, నేను అతడిని ఆశ్రయిస్తాను మరియు ప్రతీ అనాధ మరియు యాచకుడి పూణ్యానికి పదిరెట్లు పుణ్యాన్ని ప్రసాదించబడుతుంది”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ379].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
18 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21