అఅలా సూరహ్

గురు, 04/12/2018 - 05:04

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ సాటిలేని గ్రంథం అయిన ఖుర్ఆన్ యొక్క 87వ సూరహ్ అయిన “అఅలా” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

అఅలా సూరహ్

ఖుర్ఆన్ యొక్క 87వ సూరహ్ ఇది. “అఅలా” అనగ ప్రత్యేకమైనది. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “అఅలా” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 9 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 19 ఆయత్‍లు, 72 పదాలు మరియు 296 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 1 సారి వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “తక్వీర్” సూరహ్ మరియు దీని తరువాత “లైల్” సూరహ్ అవతరించబడ్డాయి. “అఅలా” సూరహ్ ను “సబ్బిహిస్మ్” అని కూడా అంటారు. “అఅలా” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “అఅలా” అన్న పద్దం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను “ఎవరైతే “అఅలా” సూరహ్ ను పఠిస్తాడో అల్లాహ్ అతడికి హజ్రత్ ముహమ్మద్[స.అ], హజ్రత్ మూసా[అ.స] మరియు హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] పై అవతరించబడ్డ సహీఫాలలో ఉన్న అన్ని అక్షరాలకు పదిరెట్లు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ326].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ326.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26