జుముఅహ్ ప్రాముఖ్యత దైవప్రవక్త[స.అ] దృష్టిలో

మంగళ, 07/31/2018 - 12:16

ఇస్లామీయ ధర్మం ప్రకారం శుక్రవారానికి చాలా ప్రముఖ్యత ఉంది. మరి దాని ప్రాముఖ్యతను వెల్లడిస్తూ మూలగ్రంథాలలో దైవప్రవక్త[స.అ] హదీసులు కూడా ఉన్నాయి.   

జుముఅహ్ ప్రాముఖ్యత దైవప్రవక్త[స.అ] దృష్టిలో

అహ్లె సున్నత్ యొక్క ప్రముఖ హదీసు గ్రంథం అయిన "ముస్నదె ఇబ్నె హంబల్"లో దైవప్రవక్త[స.అ] రివాయత్ ఇలా ఉల్లేఖించబడి ఉంది: “సూర్యడు ఉదయించిన అతి ఉత్తమ దినం శుక్రవారం, ఆ రోజు ఆదమ్ సృష్టించబడ్డారు, అదే రోజు భువిపై పంపబడ్డారు, వారి తౌబహ్ అంగీకరించబడింది మరియు మరణించారు, అదే రోజు ప్రళయం సంభవిస్తుంది... మరియు శుక్రవారం రోజు ఒక గడియం ఉంది అందలో ఒక విశ్వాసి(ముస్లిం) ఆ గడియలో నమాజ్ చదివి తన కోరికను కోరితే అది తప్పకుండా అతనికి దక్కుతుంది” [ముస్నద్ ఇబ్నె హంబల్, భాగం15, పేజీ 240]
వారి హదీస్ మూల గ్రంథాల నుండి ఒకటైన సుననె అబ్నె మాజహ్ లో మరో హదీసులో దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “శుక్రవారం, దినముల నాయకుడు, అల్లాహ్ దృష్టిలో వాటిలో ఉత్తమత్వం గలది మరియు అల్లాహ్ దృష్టిలో ఇది ఫిత్ర్ మరియు ఖుర్బాన్ పండగలకు మించినది”[సుననె ఇబ్నె మాజహ్, భాగం2, పేజీ290]

రిఫ్రెన్స్
1. ఇబ్నె హంబల్, అహ్మద్ ఇబ్నె హంబల్, ముస్నదుల్ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్, భాగం5, ముఅస్ససతుర్-రిసాలహ్, లెబ్నాన్, బీరూత్, 1416 హిజ్రీ.
2. ఇబ్నె మాజహ్, ముహమ్మద్ ఇబ్నె యజీద్, సుననుల్ హాఫిజ్ అబీ అబ్దిల్లాహ్ ముహమ్మద్ ఇబ్నె యజీద్ అల్ ఖజ్వీనీ ఇబ్నె మాజహ్, దారుల్ జయల్, లెబ్నాన్, బీరూత్, 1418 హిజ్రీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 37