న్యాయమూర్తి అతిథి

శని, 08/18/2018 - 08:52

ఇమామ్ అలీ[అ.స] ఇస్లాం ఉదేశాలను ఎలా కాపాడుకుంటూ వచ్చారో ఈ సంఘటనయే దానికి నిదర్శనం.

న్యాయమూర్తి అతిథి

ఒకవ్యక్తి ఇమామ్ అలీ[అ.స] ఇంటికి ఒక సాధారణ అతిథిగా వచ్చాడు. కొన్ని రోజులు అక్కడే అతిథిగా ఉన్నాడు. కాని అతడు ఒక సాధారణ అతిథి కాదు. మనసులో ఉన్నది మొదట్లో వ్యక్తం చేయలేదు. యదార్థమేమిటంటే ఆ వ్యక్తి మరోవ్యక్తితో ఏదో విషయంలో విరుద్ధం కలిగి ఉన్నాడు, అతడి రాక కోసం ఎదురు చూస్తున్నాడు, అతడు రాగానే ఇమామ్ అలీ[అ.స] ముందు తన సమస్య తీర్మానించాలని కోరాడానికై వేచి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని ఇమామ్ అలీ[అ.స]తో వివరించి నేను తీర్పు కోసం వచ్చాను అని అన్నాడో అప్పుడు ఇమామ్ అలీ[అ.స] “అయితే నీవు ఇరువైపుల వారిలో ఒకడివి?” అని అడిగారు. అతడు “అవును అమీరల్ మొమినీన్” అన్నాడు. “అయితే నన్ను మన్నించు ఇక ఈ రోజు నుండి నిన్ను ఒక అతిథిగా మర్యాదలు చేయలేను, ఎందుకంటే దైవప్రవక్త[స.అ] ఇలా ఉపదేశించారు: ఎప్పుడైతే ఒక సమస్య ఒక న్యాయమూర్తి దగ్గర వచ్చిందో, ప్రతిపక్షాల నుండి ఇరువైపుల వారిద్దరూ  వస్తే అతిథి మర్యాదలు చేయవచ్చు కేవలం ఒకరిని అతిథిగా మర్యాదలు చేసే హక్కు న్యాయమూర్తికి లేదు”[వసాయిల్ అల్ షియా, భాగం3, పేజీ395].

రిఫ్రెన్స్
హుర్రె ఆములీ, వసాయిల్ అల్ షియా, ముఅస్ససతు ఆలుల్ బైత్ అలైహిముస్సలామ్ లి అహ్యాయి అల్ తురాస్, ఖుమ్.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5