.నాయకుడు అల్లాహ్ తరపు నుండి నియమించబడతాడు అన్న విషయం పై ఖుర్ఆన్ నిదర్శనం.
అల్లాహ్ యే ఇమామ్ ను నియమిస్తాడు అన్న విశ్వాసం పై ఖుర్ఆన్ యొక్క కొన్ని ఆయతులే దానికి నిదర్శనం:
1. ఆయత్: وَجَعَلۡنَٰهُمۡ أَئِمَّةٗ يَهۡدُونَ بِأَمۡرِنَا وَأَوۡحَيۡنَآ إِلَيۡهِمۡ فِعۡلَ ٱلۡخَيۡرَٰتِ وَإِقَامَ ٱلصَّلَوٰةِ وَإِيتَآءَ ٱلزَّكَوٰةِۖ وَكَانُواْ لَنَا عَٰبِدِينَ ; మా ఆజ్ఞానుసారం మార్గదర్శకత్వం నెరపేవారిని మేము ఆయిమ్మహ్(నాయకులు)గా చేశాము. మేము వహీ ద్వారా సత్కార్యాలు చెయ్యండి అనీ, నమాజ్‌ను స్థాపించండి అనీ, జకాత్ ఇవ్వండి అనీ వారికి బోధించాము. వారందరూ మమ్మల్ని ఆరాధించేవారు[అంబియా సూరా:21, ఆయత్:73].
2. ఆయత్: وَجَعَلۡنَا مِنۡهُمۡ أَئِمَّةٗ يَهۡدُونَ بِأَمۡرِنَا لَمَّا صَبَرُواْۖ وَكَانُواْ بَِٔايَٰتِنَا يُوقِنُونَ; వారు సహనం వహించినపుడు, మా వాక్యాలను గట్టిగా నమ్మినపుడు, మేము వారిలో నాయకులను ప్రభవింపజేశాము[సజ్దహ్ సూరా:32, ఆయత్:24].
3. ఆయత్: وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى ٱلَّذِينَ ٱسۡتُضۡعِفُواْ فِي ٱلۡأَرۡضِ وَنَجۡعَلَهُمۡ أَئِمَّةٗ وَنَجۡعَلَهُمُ ٱلۡوَٰرِثِينَ ; భూమిలో అణచివేయబడిన వారిని కనికరించాలనీ, వారినే(ప్రజల పై) నాయకులుగా చేయాలనీ, వారినే వారసులుగా చేయాలనీ మేము ఉద్దేశించాము[ఖసస్ సూరా:28, ఆయత్:5].
రిఫ్రెన్స్
ఖుర్ఆన్ మజీద్
వ్యాఖ్యలు
ماشا ء اللہ
خیلی خوب
Shukriya.... jazakallah
వ్యాఖ్యానించండి