మేలయిన ఆగ్రహం

శని, 03/30/2019 - 11:16

ఇమామ్ మూసా కాజిమ్[అ.స] యొక్క ఆగ్రహం కూడా ఒకరి మేలు కొరకు మాత్రమే అన్న విషయాన్ని తెలియపరుస్తున్నా ఒక సంఘటన.

మేలయిన ఆగ్రహం

ఇమామ్ మూసా కాజిమ్[అ.స] ప్రమాణం చేసి చెప్పారు నేను ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్(వారి పిన తండ్రి కుమారుడు)తో మాట్లాడను అని. ఇబ్రాహీమ్ ఇబ్నె ముఫజ్జల్ ఇలా ఉల్లేఖించారు: మేము ఇమామ్ కాజిమ్[అ.స] వద్దకు వెళ్ళాము, వారితో మీరు జనాన్ని మంచి చేయమని బంధువులతో కలిసి ఉండమని ఉపదేశిస్తూ ఉంటారు; అయితే మీరే స్వయంగా మీ పినతండ్రి కుమారునితో మాట్లాడనని ప్రమాణం చేశారు.(సరికాదు కదా), అని అన్నాము.
ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: నేను అతడితో మాట్లాడకపోవడానికి కారణం, అతడికి మేలు కలిపించటం కోసమే; అదేలా అంటే అతడు నిరంతరం నా గురించి చెడుగా చెబుతూ ఉంటాడు. ఎప్పుడైతే జనం నేను అతడితో మాట్లాడనని తెలుసుకుంటారో అతడి మాటలను వారు నమ్మరు అలా అతడు నా చాడీలు చెప్పటం మానుకుంటాడు, ఇది(నా ఈ పని) అతడికి మేలు కలిపిస్తుంది.[జిందగానీయే ఇమామ్ కాజిమ్, పేజీ63]

రిఫ్రెన్స్
జమానీ, ముస్తఫా, జిందగానీయె ఇమామ్ కాజిమ్[అ.స], మష్హద్, నష్రె విలాయత్, 1378.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2