సరైన హదీస్ సూచనలు

బుధ, 06/26/2019 - 07:53

సరైన హదీస్ ను అసత్యపు హదీస్ నుండి వేరు చేయడానికి వివరించబడ్డ కొన్ని పరిమాణాల వివరణ...

సరైన హదీస్ సూచనలు

దైవప్రవక్త[స.అ] కాలం నుండే కొంతమంది అసత్యులు స్వతహాగా అబద్ధపు హదీసులను తయారు చేసి అవి దైవప్రవక్త[స.అ] లేదా అహ్లె బైత్[అ.స] ఉల్లేఖనలు అని చెప్పేవారు. మరలాంటప్పుడు సరైన హదీస్ ను ఇలాంటి తప్పుడు హదీస్ నుంచి వేరు చేయాలంటే ఒక పరిమాణం ఉండాలి. పరిశీలించి చూసినట్లైతే పవిత్ర మాసూములు కొన్ని పరిమాణాలు వివరించారు:
1. ఖుర్ఆన్ తో అనుగుణము: ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ఉల్లేఖించారు: “నిస్సందేహంగా ప్రతీ బాధ్యతకు ఒక యదార్థం మరియు ప్రతీ మంచికి ఒక వెలుగు ఉంది, కనుక అల్లాహ్ గ్రంథానికి అనుగుణంగా ఉన్న వాటిని తీసుకోండి మరియు దానికి వ్యతిరేకంగా ఉన్న వాటిని వదిలేయండి”
2. పవిత్ర మాసూముల మిగత ఉల్లేఖనలతో అనుగుణము: “హసన్ ఇబ్నె జహ్మ్” ఇలా చెప్పెను: నేను ఇమామ్ రిజా[అ.స]తో ఇలా అన్నాను: మీ నుండి మా వద్దకు పరస్పర విభేదం ఉన్న హదీసులు చేరుతూ ఉంటాయి. ఇమామ్ ఇలా అన్నారు: “మా వద్ద నుండి మీకు చేరే వాటిని అల్లాహ్ గ్రంథం మరియు మా ఇతర హదీసులతో పోల్చండి, ఒకవేళ ఆ రెండితో పోలిక ఉంటే అవి మా నుంచి వచ్చినవే కాకపోతే మావి కావు”
3. బద్ధికి అనుగుణంగా మరియు దాని తీర్పుకు వ్యతిరేకంగా ఉండకపోవడం: దైవప్రవక్త[స.అ] నుండి ఇలా ఉల్లేఖించబడి ఉంది: “ఎప్పుడైనా సరే నా హదీస్ మీ వద్దకు చేరినట్లైతే దానిని అల్లాహ్ యొక్క గ్రంథం మరియు మీ వివేకాల పరంగా పోల్చి చూడండి, ఒకవేళ ఆ రెండింటికి అనుగుణంగా ఉంటే స్వీకరించండి లేకపోతే దాన్ని గోడకేసి కొట్టండి”[మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ488]

రిఫ్రెన్స్
అలీ అస్గర్ రిజ్వానీ, మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, ఇంతెషారాతె మస్జిదె జమ్కరాన్, 1384.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12