జిహాద్ అంటే ఏమిటి, అది ఎప్పుడు చేయాలి అన్న కొన్ని ప్రశ్నలకు సంక్షిప్త సమాధానాలు...
1. జిహాద్ అనగానేమి?
జ. దైవప్రవక్త[స.అ] లేదా ఇమామ్[అ.స] అనుమతి ద్వార చేసే యుద్ధాన్ని జిహాద్ అని అంటారు
2. ఈ యుద్ధం ఎందుకని జరుగుతుంది?
జ. దీన్ సంరక్షణ కోసం
3. దీన్ రక్షణ కోసం యుద్ధం అవసరమా?
జ. ఔను, ఎప్పుడైతే దీన్ యొక్క శత్రువులు యుద్ధం చేయాలని పట్టుబడతారో అప్పుడు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది
4. యుద్ధంలో ఇమామ్[అ.స] యొక్క అనుమతి ఎందుకని అవసరం?
జ. ఇమామ్ ఎప్పుడు కూడా తప్పుడు తీర్మానం చేయరు, తద్వారా ఎవరూ అన్యాయంగా చంపబడరు
5. స్ర్తీలు కూడా జిహాద్ చేస్తారా?
జ. లేదు, జిహాద్ కేవలం పురుషుల కొరకు మాత్రమే. జిహాద్ ఇంటి పనే స్ర్తీల జిహాద్
6. జిహాద్ చేస్తూ మరణించిన వారి పరిణామమేమిటి?
జ. వారు షహీద్ అవుతారు. వారు అల్లాహ్ వద్ద జీవిస్తూ ఉంటారు. చెప్పలేనంత పుణ్యం వారికి దక్కుతుంది
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.
వ్యాఖ్యానించండి