హలాల్ మరియు హరామ్ పట్ల మన కర్తవ్యమేమిటి అన్న అంశం పై సంక్షిప్త వివరణ...

దీన్ మరియు షరీఅత్ దేనిని ఉపయోగించడాన్ని సమ్మతిస్తుందో వాటిని “హలాల్” అని అంటారు. మరి దేన్ని ఉపయోగించడాన్ని నిషేధించిందో వాటిని “హరామ్” అని అంటారు.
హలాల్ మరియు హరామ్ పట్ల జ్ఞానం కలిగి ఉండటం మరియు హరామ్ నుండి దూరంగా ఉండటం చాలా అవసరం. ప్రతీ అపవిత్ర వస్తువును తినడం మరియు త్రాగటం హరామ్, ఉదాహారణకు మలవిసర్జనాలు, రక్తం, మద్యం మొ.. ఇవి నజిస్(అపవిత్రమైనవి) అందుకని వీటిని తినటం మరియు త్రాగటం హరామ్ గా నిర్ధారించబడింది. అలా అని ప్రతీ శుభ్రమైనదీ వస్తువును తినటం లేదా త్రాగటం హలాల్ అని కాదు, ఉదాహారణకు మట్టి శుభ్రమైనదే కాని దానిని తినటం అసమ్మతమైనది.
కేవలం పులు అవసర సమయాలలో తప్ప; రోగం నుండి ఉపసమనం పొందడానికి ఇమామ్ హుసైన్[అ.స] యొక్క సమాధి మట్టిని కొద్దిగా తినటం సమ్మతమైనది. ఆ మట్టి పేరు “ఖాకె షిఫా”.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.
వ్యాఖ్యానించండి