ఆది, 08/04/2019 - 14:31
ఇస్లాం ఉహదేశానుసారం మలమూత్ర విసర్జన పద్ధతుల వివరణ సంక్షిప్తంగా...
మలమూత్రవిసర్జన సమయంలో ఖిబ్లా(కఅబహ్)కు ఎదురుగా గాని వెనక్కిగాని కూర్చోవడం నిషిద్ధం(హరామ్). మూత్రవిసర్జన తరువాత తప్పకుండా ఆ భాగన్ని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. నీళ్లు లేకుండా తహారత్(శుభ్రం) అవ్వదు. మూత్రవిసర్జన తరువాత కాగితంతో గాని, గుడ్డతో గాని లేదా రాళ్లతో గాని తుడుచుకుంటే చాలదు కేవలం నీళ్లు మాత్రమే దాన్ని శుభ్రపరుస్తుంది.
మలమూత్ర విసర్జనలను మనల్ని ఎవరూ చూడలేనటువంటి ప్రదేశానికి వెళ్లి చేసుకోవాలి. నిలబడి మూత్రవిసర్జన చేసుకోవడం చాలా తప్పు, మన ఇమాములు అలా చేయడం పై చాలా గట్టిగా నిషేదించారు.
మలమూత్ర విసర్జన తరువాత ఆ ప్రదేశాలను ఎడమ చేతితో కడుక్కోవాలి.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి