తఖ్లీద్

ఆది, 10/22/2017 - 05:26

.ఇస్లాం ధర్మం యొక్క ఫిఖా అహ్కాములు తెలుసుకోవడానికి ప్రతీ మనిషి కోసం మూడు మార్గాలు ఉన్నాయి.

తఖ్లీద్

షియా ముస్లింలు ఇలా అంటారు: ఫురూయే దీన్ అనగా షరీఅత్ యొక్క ప్రార్ధన ఆదేశాలు ఉదా:‎ నమాజ్, ఉపవాసం, హజ్జ్, జకాత్ మొ॥. వాటిని ఆచరించే విధానం తెలుకోవడానికి ప్రతీ మనిషి కోసం మూడు మార్గాలు ఉన్నాయి. ఆ మూడు మార్గాల నుండి ఏదో ఒక దానిని ఆచరించాల్సి మరియు దాని పై కట్టుబడి ఉండాల్సి ఉంటుది.
1. మనిషి స్వయంగా ముజ్తహిద్(ధర్మవేది) అయ్యి ఉండాలి. అనగా ఒకవేళ అతడిలో సమర్థత ఉంటే, ఆదేశాల ఆధారములలో విచారించి స్వయంగా అల్లాహ్ ఆదేశాలను అర్ధం చేసుకోవాలి.
2. ఒకవేళ ముజ్తహిద్ కాకపోతే అప్పుడు మీలో ఎహ్తియాత్( అనగా తాను అమలు చేస్తున్న ఆ పని తన పై అవశ్యకమైన వాటి పై అమలు చేశాను అని నమ్మకం కలగడం. ఉదా: కొంత మంది ముజ్తహిద్‌లు ఒక దానిని హలాల్ అని మరికొందరు హరామ్ అని ఆదేశిస్తున్నారు అలాంటప్పుడు దాని పై అమలు చేయకుండా వదిలేయాలి. మరియు అలాగే మజ్తహిదులలో కొందరు ఒక దాని పై అమలు చేయడం వాజిబ్ మరికొందరు ముస్తహబ్ అంటున్నారు అలాంటప్పుడు దాని పై అమలు చేయాలి.) పై అమలు చేసే సమర్ధత ఉంటే ఎహ్తియాత్ పై అమలు చేయాలి.
3. ఒకవేళ ఈ (రెండు) సాధ్యం కాకుంటే సమగ్ర అర్హతలు గల ముజ్తహిద్ యొక్క తఖ్లీద్ చేయాలి అనగా జీవించి ఉన్న, వివేకం గల, న్యాయంగల, విద్యావంతుడైన, తన ఆత్మను పాపముల నుండి కాపాడుకోగల, తన దీన్‌ను రక్షించుకోగల, తన ఆత్మ కోరికలను ఎదురుకోగల ముజ్తహిద్ యొక్క తఖ్లీద్ చేయాలి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 28