అప్పు కాదు, అది నీ హక్కు

సోమ, 08/26/2019 - 18:19

లేని వారికి దానమిచ్చి ఆదుకోవటం మన బాధ్యత.అది కూడా ఎదుటివాడు చెయ్యి చాచి అడగక ముందే అతనికి సహాయం చేస్తే మంచిది.

అప్పు,హక్కు,ఖర్చు.

ఒక వ్యక్తి ఇమాం సాదిఖ్[అ.స] ల వారి వద్దకు వచ్చి “ఎప్పటివరకైతే నా ఆర్ధిక పరిస్థితి బాగుపడదో అప్పటి వరకు నాకు కొంత సొమ్మును అప్పుగా ఇవ్వండి” అని అన్నాడు.దానికి ఇమాం సాదిఖ్[అ.స] ల వారు “అంటే నీ పంట సొమ్ము చేతికి వచ్చే వరకా?”అని ప్రశ్నించారు.దానికి ఆ వ్యక్తి “నా వద్ద ఎటువంటి పొలము లేదు” అని అన్నాడు.దానికి ఇమాం[అ.స] ల వారు “నీ వ్యాపారపు సొమ్ము తిరిగి వచ్చే వరకా?” అని ప్రశ్నించారు.దానికి ఆ వ్యక్తి “నా వద్ద ఎటువంటి వ్యాపారపు సొమ్ము కూడా లేదు” అని అన్నాడు.తిరిగి ఇమాం[అ.స] ల వారు “నీ భూమి అమ్ముడు పోయే వరకా?” అని ప్రశ్నించారు.దానికి ఆ వ్యక్తి:  “నా వద్ద ఎటువంటి ఆస్తి లేదు” అని అన్నాడు.అప్పుడు ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: నువ్వు ఎవరి కొరకైతే భగవంతుడు మా సొమ్ములో నుండి కొంత భాగాన్ని హక్కుగా నియమించాడొ వారిలో ఒక్కడివి.నీకు అప్పు అవసరం లేదు,కొంత సొమ్మును నేను నీకు ఇవ్వాలి అని, కొన్ని దిర్హములను అతనికి ఇచ్చి ఈ విధంగా పలికారు: “వీటిని ఖర్చు చేసేటప్పుడు విపులమైన విధంగా[మిక్కిలి అధికంగా] లేదా వ్యర్ధంగా[మిక్కిలి తక్కువగా] కాకుండా రెండింటికి మధ్య[అవసరానికి అనుగుణంగా] ఖర్చు చేయి” అని అన్నారు.

రెఫరెన్స్

అల్ కాఫి, 3వ భాగం, పేజీ నం:501.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12