ఆంటొఇన్ బార దృష్టిలో ఇమాం హుసైన్[అ.స]

శని, 08/31/2019 - 14:56

ఇమాం హుసైన్[అ.స] ల వారు అంటోఇన్ బార దృష్టిలో

ఇమాం హుసైన్,అంటోఇన్ బార,కర్బలా.

కర్బలా విషాద గాధకు బండరాళ్ళు సైతం కన్నీటి పర్వమవుతాయి ఈ విషాద గాధ అలాంటిది. కర్బలా మైదానంలో తన పరివారసమేతంగా అసువులుబాసి అమరులైన ఇమాం హుసైన్[అ.స] ల వారిని ఈ రోజు కూడా ఈ లోకం అధర్మానికి,అన్యాయానికి వ్యతిరేకంగా,మానవత్వ విలువల కొరకు పోరాడి అమరుడైన ఒక యోధునిగా  గుర్తుచేసుకుంటుంది.ఆయన కార్యచరణను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ఎన్నో విప్లవాలకు నాంది పలికారు.అలాంటి వారిలో ఒకరే ఆంటొఇన్ బార[antoine bara].మతపరంగా క్రైస్తవుడైన ఈయన ఇస్లామీయ చరిత్ర మరియు ప్రత్యేకంగా ఇమాం హుస్సైన్[అ.స] ల వారి గురించి ఎంతో పరిశోధన చేసారు. ఎన్నో సంవత్సరాల పరిశోధన తరువాత “క్రైస్తవుల ఆలోచనలో ఇమాం హుసైన్” అనే పుస్తకాన్ని రచించారు.1978లో ఈ పుస్తకం ప్రచురించబడింది. ఈయన సాహిత్యంలో సమర్ధుడు మరియు మంచి రచయిత కూడా ఈ పుస్తకంతో పాటు వేరే 15 పుస్తకాలను రచించారు. ఇమాం హుసైన్[అ.స] ల వారు కేవలం షీయా ముస్లింలకు సంబంధించిన వారు కారని ప్రపంచంలో గల మానవులందరికి సంబంధించిన వారని ఆయన అభిప్రాయం.చివరిగా ఆయన “ఇమాం హుసైన్[అ.స] ల వారు నా హృదయంలో ఉన్నారు” అని తన మాటను ముగించారు. ఈ క్రైస్తవ ఆలొచనాపరుడు 25 సార్లు నెహ్జుల్ బలాఘాను అధ్యాయనం చేయటం జరిగింది.

రెఫరెన్స్: అల్ హుసైన్ ఫిల్ ఫిక్రిల్ మసీహి,అంటొఇన్ బార.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15