.ప్రవక్త ముహమ్మద్[స.అ] కుటుంబ స్త్రీలను మరియు చిన్న పిల్లలను బంధించి అవమానించడానికై ఒక పట్టణం నుండి మరో పట్టణానికి త్రిప్పారు.
హిజ్రీ 60వ శకంలో అపకారి, త్రాగుబోతు, హింసకుడు మరియు నిర్దోషులను చంపిన ఘాతకుడు యజీద్, అప్పట్లో షామ్(సిరియా) అధిపతిగా ఉండేవాడు. ఇలాంటి నీచుడైన యజీద్ తనతో బైఅత్(అనగా తన అజ్ఞానుగుణంగా ఉంటానని ప్రతిజ్ఞ చేయడం) చేయమని ఇమామ్ హుసైన్[అ.స]ను బెదిరించాడు. దైవప్రవక్త ముహమ్మద్[స.అ] ఉత్తరాధికారి మరియు ముస్లిముల ఇమామ్ అయిన ఇమామ్ హుసైన్[అ.స] యజీద్ లాంటి వాడితో ప్రమాణానికి సిధ్ద పడలేదు. అందుకు యజీద్ సైన్యం, వారి పై దాడి చేసి 1400 సంవంత్సరాల క్రితం ముహర్రం నెల 10వ తారీకు హిజ్రీ శకం 61వ సంవత్సరంలో కర్బలా భూమి పై మూడు రోజుల పాటు అన్నపానియాలకు దూరంగా ఉంచి వారిని, వారి ప్రాణ స్నేహితులను, అన్నదమ్ములను, వారి కుమారులను, చివరికి 6 నెలల పసిబిడ్డను బాణాలతో, ఖడ్గాలతో అన్యాయంగా నరికి చంపేశారు. ఆ తరువాత వారి స్త్రీల డేరాలకు నిప్పంటించారు. వారిలో జ్వరంతో వున్న ఇమామ్ హుసైన్[అ.స] కుమారునికి కాళ్ళూ చేతులలో సంకెళ్ళు మెడలో ముళ్ళకంఠహారం వేసి, మిక్కిలి క్షోభతో నిస్సాహాయులుగా మిగిలివున్న ప్రవక్త ముహమ్మద్[స.అ] కుటుంబ స్త్రీలను మరియు చిన్న పిల్లలను బంధించి అవమానించడానికై ఒక పట్టణం నుండి మరో పట్టణానికి త్రిప్పారు.
వ్యాఖ్యానించండి