కర్బలా సంఘటన సంభవించిన తరువాత ఇస్లాం ప్రపంచంపై సంభవించిన వాస్తవ్యాలను ఈ క్రింది వ్యాసంలో ప్రస్థావించడం జరిగింది.
కర్బలా సంఘటన సంభవించిన తరువాత ఇస్లాం మరియు ముస్లిములలో చాల మార్పులు సంభవించాయి వాటికి చరిత్రే సాక్ష్యం చెబుతుంది వాటిలొ కొన్ని వాటిని మేము ఇక్కడ ప్రస్థావిస్తున్నాము:
1. చాలా మంది ఆలోచన తీరు బనీ ఉమయ్య ఖలీఫాల పట్ల మారింది. వారి రాజ్యాధికారం కేవలం అజ్ఙానం మరియు అన్యాయం, దౌర్జన్యం పై ఆధారపడి ఉన్నదని వారు తెలుసుకున్నారు. దీనికి కర్బలా సంఘటనే సాక్ష్యం.
2. ప్రజలకు సమాజంలో జరిగే దౌర్జన్యాన్ని మరియు అన్యాయాన్ని వ్యతిరేకించే ధైర్యం వచ్చింది దీనికి 65 హిజ్రిలో తవ్వాబీన్ లు బనీ ఉమయ్యా పై చేసిన యుధ్ధమే సాక్ష్యం.
3. కర్బలా మరియు ఆషూర ప్రపంచంలో జరిగే అన్యాయాలన్నింటికి వ్యతిరేకించే విప్లవమాత్మక అందోళనలకు ఒక యూనివర్సిటిగా మారాయి, దీనికి చరిత్రలో సంభవించిన ఎన్నొ విప్లవమాత్మక అందొలనలు సాక్ష్యం చెబుతున్నయి వాటిలొ ముఖ్యమైనవి క్యుబా,ఇరాన్,లిబియాలలొ జరిగిన అందోళనలు.
ఏది ఏమైనా కర్బలా గాధ మరియు ఇమాం హుసైన్(అ.స)ల వారి బలిదానం ప్రపంచంలో స్వాతంత్రం మరియు న్యాయం కోసం తాపత్రయపడేవారికి ఒక ఆదర్శంగా మారింది.
వ్యాఖ్యలు
Subhanallah
వ్యాఖ్యానించండి