.మనసుని కలచివేసే కర్బలా సంఘటనకు 1400 సంవత్సరాలు గడిచినా దానినే ప్రతీ సంవత్సరం స్మరించడానికి గల ముఖ్యకారణం.
మనసుని కలచివేసే కర్బలా సంఘటనకు 1400 సంవత్సరాలు గడిచినా దానినే ప్రతీ సంవత్సరం స్మరించడానికి గల ముఖ్యకారణం, యావత్ ప్రపంచానికి సత్య అసత్యాల మధ్య బేధాన్ని తెలియపరచడం. ఇస్లాం కోసం ప్రాణలను ఆనందంగా త్యాగం చేసేవారెవరో మరియు పైకి ఇస్లాం దూస్తులు ధరించి ఇస్లాం ఆజ్ఞలను వ్యతిరేకించువారు ఎవరో తెలియాలి.
ఇస్లాం, హింస మరియు హింసాకారులకు విరుధ్ధం. ఇస్లాం ఎల్లప్పుడూ సత్యం, ధర్మం మరియు శాంతి సందేశాన్నే ఇస్తుంది. చూడడానికి యజీద్ మరియు అతడి సైన్యం ముస్లిములే కాని వాళ్ళకు ఇస్లాం ఉపదేశలతో ఎటువంటి సంబంధం ఉండేది కాదు. ఈనాడు కొందరు ఇస్లాం పేరున పలు ఇస్లామీయ దేశాల పై ఏపాపము ఎరగని అమాయకులను చంపుతున్నారు, వీళ్ళూ ఆ యజీదియులతో సమానం. వీళ్ళు కూడా యజీద్ వలే కేవలం పేరుకు మాత్రం ముస్లిం జిహాదీలు. తమని తాము మంచి పూర్వీకుల అడుగుజాడలలో నడిచే వారము అని అంటారు, కాని నిజానికి వీళ్ళు ఏజాతికీ, సంబంధం లేనివారు. మతం పేరుతో జరుగుతున్న రాజకీయ మరియు బలాబలాల యుధ్ధం ఇది. ప్రపంచ ముస్లింలందరూ వాళ్ళను అసహ్యించుకుంటున్నారు.
వ్యాఖ్యలు
Labbaik ya Hussain a.s
shukriya ...
జజకల్లాహ్ మౌలానా సాబ్
అల్లా సలమత్ రహకే...
షుక్రియా... ఆమీన్.
It'true
jazakallah. thanks.
వ్యాఖ్యానించండి