వహబ్ ఇబ్నె అబ్దుల్లాహె కల్బీ

గురు, 09/05/2019 - 16:39

కర్బలాలో ఇమాం హుసైన్[అ.స] ల వారితో పాటు వీరమరణాన్ని పొందిన వహబ్ ఇబ్నె అబ్దుల్లాహ్ కల్బి గురించి సంక్షిప్తంగా.

వహబ్ ఇబ్నె కల్బి,కర్బలా,ఇమాం హుసైన్.

వహబ్ ఇబ్నె వహబ్ లేదా వహబ్ ఇబ్నె అబ్దుల్లాహ్ ఇబ్నె హుబాబె కల్బీ ఇమాం హుసైన్[అ.స] అనుచరులు మరియు ఇమాం ల వారితో సహా ఇస్లాం సం రక్షణ కొరకు తమ ప్రాణాలను అర్పించిన వారిలో ఒకరు.చరిత్ర వారిని ఒక క్రైస్తవునిగా పేర్కొంటుంది. కూఫా  యొక్క దారిలో తన తల్లితో సహా ఇమాం హుసైన్[అ.స] ల వారి చేతుల మీదుగా ఇస్లామును స్వీకరించి ఆషూరా రోజున ఇమాం ల వారి తరపునుండి ఇస్లాం కొరకు యజీద్ సైన్యంతో పోరాడి తన ప్రాణాలను ధారబోశారు.వారు ఆషూరా రోజున బురైర్ మరియు జియాద్ ఇబ్నె ముహాజిర్ ల తరువాత యుధ్ధానికి వెళ్ళి తన ప్రాణాలను అర్పించారు.యుధ్ధానికి వెళుతున్న వహబ్ వెనుక వారి భార్య కూడా వారితో ప్రాణాలను అర్పిస్తానని వెళ్ళగా ఇమాం హుసైన్[అ.స] ల వారు వహబ్ భార్యకు స్వర్గం యొక్క వాగ్దానాన్ని ఇచ్చి వెనక్కు పంపారు.యుధ్ధ మైదానంలోకి వెళ్ళిన వహబ్ పదాతీదళంలో 12 మందిని అశ్వికదళంలో 19 మందిని చంపారు. చివరకు శత్రువులు వారిని ఖైదు చేసి వారి తలను నరికి ఇమాం హుసైన్[అ.స] ల వారి సైన్యం వైపు విసిరారు. ఈ విధంగా వహబ్ విశ్వాసులకు ఒక ఉదాహరణగా చరిత్రలో మిగిలిపోయారు.

రెఫరెన్స్:నఫసుల్ మహ్మూం,ఖుమ్మి,పేజీ నం:259.ఆమాలియె షైఖ్ సదూఖ్,పేజీ నం:161.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2