దైవప్రవక్త[స.అ] తీరు ఇస్లాం స్వీకరణకు కారణం

ఆది, 09/29/2019 - 16:23

దైవప్రవక్త[స.అ] ప్రవర్తన ఒకరి ఇస్లాం స్వీకరణకు కారణం అయిన సంఘటన...

దైవప్రవక్త[స.అ] తీరు ఇస్లాం స్వీకరణకు కారణం

ఒకసారి దైవప్రవక్త[స.అ] మరియు సహాబియులుండగా బిడియము లేకుండా మసీదులో ఒక ఆరాబీ(అనాగారికుడు) మూత్ర విసర్జన చేశాడు. అతడి ఆ పనిని చూసి చంపేయడానికి సహాబీయులు తమ ఖడ్గాలను ఒర నుండి తీశారు. దైవప్రవక్త[స.అ] వాళ్ళను ఆపి “ఇలాంటి పని చేయకండి ఆ మూత్రం పై ఒక బకెటు నీళ్ళు పోయండి. మీరు సరళమైన జీవన విధానానికై జన్మించబడ్డారు దుష్కరత, కష్టాలు మరియు ఆపదల కోసం కాదు. మీ పని మంచిని పెంచడం అంతేగాని చెడుని సృష్టించడం కాదు” అని అన్నారు. సహాబియులందరూ వారి ఆజ్ఞను పాలించారు. దైవప్రవక్త[స.అ] ఆ మనిషిని పిలిచి తమ వద్ద కూర్చోబెట్టుకున్నారు. అతడితో చాలా సున్నితంగా ప్రేమతో “ఇది అల్లాహ్ ఆలయం దీనిని అపవిత్రం చేయకూడదు” అని అన్నారు. అతను దైవప్రవక్త[స.అ] మంచి ప్రవర్తనను చూసి ఇస్లాం స్వీకరించాడు. ఆ తరువాత ఎల్లప్పుడూ చాలా మంచి మరియు శుభ్రమైన దుస్తులు ధరించి మసీదుకు వచ్చేవాడు. అల్లాహ్ తమ దైవప్రవక్త[స.అ]తో సత్య ఉపదేశమే ఇచ్చాడు: “నీవే గనుక కర్కశుడవు, కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టుపక్కల నుండి దూరంగా  పోయేవారు”[]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13