దివ్యఖురాను దృష్టిలో మహనీయప్రవక్త[స.అ.వ]

మంగళ, 11/12/2019 - 17:58

అత్యున్నత లక్షణాలను కలిగి ఉన్న దైవప్రవక్త[స.అ.వ] ల వారి వ్యక్తిత్వాన్ని వివరించటం సాధ్యం కాని పని.ఇస్లాము ఈ నాడు ప్రపంచ నలుమూలలకు వ్యాపించిందంటే దానికి ఈ మహామూర్తి యొక్క ఆదర్శ జీవితమే కారణం అని చెప్పవచ్చు.

మహనీయప్రవక్త,అత్యున్నతస్థానం,అవిశ్వాసులు.

సమస్త మానవాళిని అజ్ఞానాంధకారము నుండి రుజుమార్గాన్ని చూపిన మార్గదర్సి,ఇస్లాం వ్యవస్థాపకుడై కూడా తన సాదాసీదా నడవడికతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మహనీయుడు, అత్భుతమైన విప్లవాన్ని లేవదీసిన అసాధారణ శక్తిస్వరూపుడైన హజ్రత్ ముహమ్మద్[స.అ.వ]ల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే, వారిని ప్రశంసించటం ఈ మానవునికి అసాధ్యం. అల్లాహ్ తన పవిత్రగ్రంధంలో ఎన్నో చోట్ల మహనీయ ప్రవక్త[స.అ.వ]ల వారిని చాలా అందమైన మరియు అత్యంత పరిపూర్ణమైన పదబంధంతో పరిచయం చేసి అత్యున్నత లక్షణాలతో వారిని ప్రశంసించటం జరిగింది. చాలా చోట్ల దైవప్రవక్త[స.అ.వ]ల వారి పేరుతో కాకుండా యాసీన్, ముజమ్మిల్[వస్త్రమును కప్పుకున్న వాడా], ముద్దస్సిర్[కంబళి కప్పుకున్నవాడా] అని సంబోధించటం జరిగింది. వారి గురించి అల్లాహ్ దివ్యఖురానులో ఒక చోట ఈ విధంగా సెలవిస్తున్నాడు: “ఇంకా,నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు” [అల్ ఖలం/4]. దీనిని బట్టి ఆ దేవుని దృష్టిలో అత్యున్నత స్థానం కేవలం ఆ మహనీయ ప్రవక్తల వారిదే.వేరొక చోట వారి దయాగుణాన్ని వివరిస్తూ ఈ విధంగా సెలవిస్తున్నాడు: “ముహమ్మద్[స.అ.వ] అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడుపడని వారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు” [అల్ ఫత్ హ్/29].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17