సామూహిక నమాజు యొక్క ప్రాముఖ్యత

శుక్ర, 11/15/2019 - 18:37

సామూహిక నమాజు యొక్క ప్రాముఖ్యత దివ్యఖురాను మరియు దైవప్రవక్త[స.అ.వ] ల వారి హదీసులలో.

సామూహిక నమాజు,దైవప్రవక్త,ప్రాముఖ్యత.

ఇస్లాములో సామూహిక నమాజుకు చాలా ప్రాముఖ్యతను ఇవ్వటం జరిగింది.అల్లాహ్ తన దైవగ్రంధంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు: "మీరు నమాజులను నెలకొల్పండి,జకాతును ఇవ్వండి,[నా సన్నిధిలో] రుకూ చేసే వారితో పాటు మీరూ రుకూ చేయండి" [అల్ బఖర/43].హదీసులలో కూడా సామూహికంగా నమాజు చేయమని ఎన్నోచోట్ల తాకీదు చేయటం జరిగింది.దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఒక హదీసులో ఈ విధంగా ఉల్లేఖించారు: "ఎవరైతే అజాను పిలుపును విని ఎటువంటి కారణం లేకుండా సామూహిక నమాజులో పాల్గొనడో అతను చేసే నమాజుకు ఎటువంటి విలువ ఉండదు".వేరొక చూట ఈ విధంగా సెలవిస్తున్నారు: "ఎవరైతే సామూహిక నమాజును అవమానిస్తారో[ధిక్కరిస్తారో] వారు అల్లాహ్ ను అవమానించినట్లే". వేరొక చోట దాని ప్రతిఫలాన్ని వివరిస్తూ ఈ విధంగా సెలవిస్తున్నారు: "ఎవరైతే సామూహికంగా నమాజు చేయటానికి తమ ఇంటి నుండి బయలుదేరుతారో లేదా సామూహిక నమాజు గురించి మస్జిదులో నిరీక్షిస్తారో వారి ప్రతిఫలం నమాజులో నిమగ్నమై ఉన్న వ్యక్తి యొక్క ప్రతిఫలంతో సమానం".వేరొక హదీసులో ఈ విధంగా ఉల్లేఖించటం జరిగింది: "సామూహికంగా చేసే ఒక్క నమాజు నలభై యేండ్లు ఇంట్లో ఒంటరిగా చేసిన నమాజుతో సమానం".ఒక రోజు యొక్క నమాజు[ ప్రతిఫలమా]? అని అనుచరులు ప్రశ్నించారు.దానికి దైవప్రవక్త[స.అ.వ] ల వారు "కాదు ఒక నమాజు[యొక్క ప్రతిఫలం]" అని అన్నారు.  

రెఫరెన్స్: వసాయెలుష్ షీయా,5వ భాగం,పేజీ నం:375,మన్లా యహ్జరుహుల్ ఫఖీహ్,1వ భాగం,పేజీ నం:377,కంజుల్ ఉమ్మాల్,8వ భాగం,హదీసు నం:22818.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8