నిందారోపణ దివ్యఖురాను దృష్టిలో

సోమ, 02/03/2020 - 18:10

ఇస్లాము తీవ్రంగా ఖండించే అశ్లీలమైన కార్యాలలో అపనిందలు వేయటమనేది ఒకటి.దీనిని ఖండిస్తూ ఇలాంటి చెడు కార్యాల జోలికి పోవద్దని దివ్యఖురాను తాకీదు చేస్తుంది.

నిందారోపణ,దివ్య ఖురాను,పాపము.

ఇతరులపై అభాండాలు వేయటం మరియు సమాజంలో అసత్యప్రచారాల ద్వారా ఏ పాపం ఎరుగని అమాయకులను వేధించటమనేది అల్లాహ్ దృష్టిలో ఘోరమైన పాపము.అభాండాలు,అపనిందలు వేయటం అనేది నాలుక యొక్క అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటి.ఇలాంటి అశ్లీలమైన పనికి ఇస్లాములో ఎటువంటి స్థానము లేదు.దివ్యఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: “ఇంకా ఎవరైనా ఏదైనా తప్పు చేసి,లేదా పాపానికి పాల్పడి ఆ నిందను ఏ పాపము ఎరుగని అమాయకునిపైకి నెట్టివేస్తే,అలాంటివాడు చాలా పెద్ద అపనిందను,స్పష్టమైన పాపాన్ని ఎత్తుకున్నవాడవుతాడు” [అన్ నిసా/112]. ఇతరులపై నిందలు వేసే వాడు ఆ వ్యక్తి పట్ల చెడు అభిప్రాయాలు కలిగి ఉంటాడు ఈ చెడు అభిప్రాయాలను ఆ వ్యక్తి ముందు వెల్లడించకుండా తనలో తానే అతని పట్ల చెడు అభిప్రాయాలను ఏర్పరచుకుంటాడు అదే అపనిందలకు దారితీస్తుంది. అపనిందలు వేసే అలవాటు ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని కూడా నాశనం చేస్తుంది. అభాండాలు వేసే వ్యక్తిని సమాజములో ఉన్న విశ్వాసులు ఎందుకు నిలదీయరు? అని దివ్యఖురాను ప్రశ్నిస్తుంది. దాన్ని గురించి వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు తమ వారి పట్ల మంచి తలంపుతో “ఇది పచ్చి అభాండం” అని ఎందుకనలేదు? [అన్ నూర్/12].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7