పాపముల నుండి విముక్తికి ఐదు మార్గములు

శని, 12/23/2017 - 18:30

ఒకే హృదయంలో అల్లాహ్ మరియు షైతాన్ ఇద్దరూ ఉండటం అసాధ్యం.

పాపముల నుండి విముక్తికి ఐదు మార్గములు

అనంతకరునామయుడు అపారక్రుపాసీలుడైన అల్లాహ్ పేరిట
ఒక వ్యక్తి ఇమాం హుసైన్[అ.స]వారి వద్దకు వచ్చి నేను ఒక పాపిని, పాపముల నుండి విముక్తి పొందలేక పోతున్నాను దానికి ఎదైనా ఒక ఉపాయాన్ని సూచించండీ అని చెప్పాడు, దానికి స్పందిస్తూ ఇమాంల వారు ఈ విధంగా సెలవిచ్చారు:
قال علیہ السلام : ''افعل خمسۃ اشیاء واذنب ما شِئت...'' فاول ذالک لا تاکل رزق اللہ واذنب ما شِئت،والثانی واخرج من ولایۃ اللہ واذنب ما شِئت،والثالث واطلب موضعا لا یراک اللہ واذنب ما شِئت ،والرابع اذا جاءک ملک الموت لیقبض روحک فادفعہ عن نفسک واذنب ما شِئت،والخامس اذا ادخلک مالک فی النار فلا تدخل فی النار واذنب ما شِئت [جامع الاخبار،ص:130].
ఐదు పనులను చేయి (ఎప్పుడైతే నీవు ఈ ఐదు పనులను చేయగలవో)  అప్పుడు నీ మనసు ఏది చెబితే ఆ పాపములను చేసుకోవచ్చు:
1. అల్లాహ్ నీకు ప్రసాదించిన జీవన ఆధారాన్ని తినకు, మరియు నీకు తోచిన పాపాన్ని చెసుకో.
2. అల్లాహ్ యొక్క సామ్రాజ్యాన్ని విడిచిపో, మరియు నీకు తోచిన పాపాన్ని చెసుకో.
3. అల్లాహ్ లెని చోటును వెతుకుకో, మరియు నీకు తోచిన పాపాన్ని చేసుకో.
4. ఎప్పుడైతే ఇజ్రాయేల్ నీ ప్రాణాలను తీసుకుపోవడనికి వస్తాడో అతనిని వెనక్కి పంపివేయి, మరియు నీకు తోచిన పాపాన్ని చేసుకో.
5. ప్రళయ దినాన దేవదూత నిన్ను నరకానికి తీసుకుపోవునప్పుడు నీవు నరకంలోకి వెళ్ళవద్దు, మరియు నీకు తోచిన పాపాన్ని చేసుకో.
పై హదీసు ద్వారా ఇమాంల వారు చెప్పదలచినదేమిటంటే పాపములను చేయుటకు ఈ లోకంలో ఏటువంటి మార్గము లేదు, ఎందుకంటే ఎవరైతే దైవప్రసన్నతిని మరియు ఆ దేవుడు ప్రసాదించే స్వర్గం యొక్క స్వాధిష్టాన్ని కోరుకుంటారో వారు ఈ పాపముల నుండి దూరంగా ఉండవలెను, ఎందుకంటే ఎవరైతే పాపముల నుండి దూరంగా ఉంటారో వారే దేవునికి దగ్గరవుతారు మరియు ప్రళయ దినాన స్వర్గంలో వారు పై స్థాయిలో ఉండటానికి అర్హులవుతారు. [జామియుల్ అఖ్బార్, పేజీ నం:130]

రిఫ్రెన్స్
జామియుల్ అఖ్బార్, షయీరి, పేజీ నం:130

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20