పాపములకు పశ్చాత్తాపం!

మంగళ, 03/13/2018 - 20:43

ఈ లోకంలో తప్పులు చేయని మానవుడు ఉండడు,పాపములు చేయని మనుష్యులు లేరు, కానీ ఆ పాపముల నుండి ప్రాయశ్చితం[తౌబా] ద్వార విముక్తి పొంది ఆ అల్లాహ్ దారిని ఎంచుకొన్న వారే నిజమైన అల్లాహ్ దాసులు.  

పాపములకు పశ్చాత్తాపం!

ఈ లోకంలో పాపములలో మునిగి ఆ అల్లాహ్ కరుణ పట్ల నిరాశ చెందిన పాపాత్ములను సంభోదిస్తూ అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
قُلْ يَٰعِبَادِىَ ٱلَّذِينَ أَسْرَفُوا۟ عَلَىٰٓ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا۟ مِن رَّحْمَةِ ٱللَّهِ ۚ إِنَّ ٱللَّهَ يَغْفِرُ ٱلذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُۥ هُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ
(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: "తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు[అజ్-జుమర్/53].
తౌబా అనగా "పాపములను వదిలి రుజుమార్గం వైపు రావటం" మరియు ఈ పాపముల నుండి విముక్తి కేవలం ప్రాయస్చితం మరియు ఆ అల్లహ్ క్షమాపణ ద్వారానే సాధ్యమవుతుంది,ఈ లోకంలో ఆ సర్వలోకేస్వరుడైన అల్లాహ్ తప్ప మరెవరు మన పాపాలను క్షమించగలుగుతారు,దివ్య ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నది:
وَهُوَ ٱلَّذِى يَقْبَلُ ٱلتَّوْبَةَ عَنْ عِبَادِهِۦ وَيَعْفُوا۟ عَنِ ٱلسَّيِّـَٔاتِ وَيَعْلَمُ مَا تَفْعَلُونَ
“ఆయనే   తన   దాసుల   పశ్చాత్తాపాన్ని   స్వీకరిస్తాడు,   వారి   తప్పులను   మన్నిస్తాడు.   మీరు   చేసేదంతా   ఆయనకు   తెలుసు” [అష్-షూరా/25].
కేవలం పశ్చాత్తాపం మరియు క్షమాపణ మరియు మంచి కార్యాలు చేయటమే కాకుండా సన్మార్గంపై స్తిరంగా ఉండటం కూడా చాలా అవసరం,అలా చేసినవారికే అల్లాహ్ క్షమిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు:
وَإِنِّى لَغَفَّارٌۭ لِّمَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَٰلِحًۭا ثُمَّ ٱهْتَدَىٰ
“అయితే   పశ్చాత్తాపం   చెంది,   విశ్వసించి,   సత్కార్యాలు   చేసి,   ఆపై   సన్మార్గంపై   స్థిరంగా   ఉన్న   వారిని   నేను   అమితంగా   క్షమిస్తాను” [తాహా/82].
మహనీయ ప్రవక్త[స.అ.వ] ఈ విధంగా ఉల్లేఖించారు: "తన పాపములపై ప్రాయశ్చితుడైనవాడు ఎటువంటి పాపము చేయని వాడితో సమానం"
తౌబా[ప్రాయశ్చితం] యొక్క అర్ధాన్ని వివరిస్తూ ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: తౌబా[ప్రాయశ్చితం] అనగా చేసిన పాపానికి తన మనస్సులో పశ్చాత్తాపం చెందటం,తన నోటితో[ఆ అల్లహ్ సన్నిధిలో] క్షమాపణ కోరటం,ఆ పాపాన్ని వదిలి వేయటం,తిరిగి మరల ఆ పాపాం జోలికి పోనని గట్టిగా తనలో తాను నిర్ణయించుకోవటం".
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:"ప్రతీ నొప్పికి ఒక ఔషధం ఉంటుంది అలాగే పాపముల యొక్క ఔషధం[ఆ అల్లాహ్ సమక్షంలో] క్షమాపణ మరియు శరణువేడటం".

రెఫరెన్స్
గురరుల్ హికం, పేజీ నం:39, అష్-షహాబు ఫిల్ హికమి వల్ ఆదబ్, పేజీ నం:18, సవాబుల్ ఆమాల్, పేజీ నం:365.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17