దైవప్రవక్త[స.అ] నిజమైన ఉత్తరాధికారులు జ్ఞానులు. అజ్ఞానులు మార్గదర్శకులు కాలేరు...
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఓ అలీ[అ.స] నీవు నా ఉమ్మత్ యొక్క బేధములలో సత్యాన్ని పలికే వానివి”.[తారీఖె దమిష్కె ఇబ్నె అసాకిర్, భాగం2, పేజీ 488]
దైవప్రవక్త[స.అ] సందేశ ప్రచారం హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు మరియు అతనే ప్రతీ బేధంలో ఉన్న యధార్థాన్ని చెప్పగలిగేవారు. ఎటువంటి సమయంలోనైనా సరే అల్లాహ్ ఆదేశాలను మరియు ఆయన అత్యుత్తమ దీన్ ను కాపాడే ప్రయత్నం చేసే వారు, వేర్వేరు వర్గాలవారితో జ్ఞాన పరమైన సంభాషణలు చేసి వారిని ఇస్లాం మార్గం వైపు తీసుకొచ్చేవారు. ప్రతీ ఒక్కరి ప్రశ్నలకు సమాధానమిచ్చేవారు.
మరి అలాంటప్పుడు “అబ్బా” మరియు “కలాలహ్” పదాలకు అర్థం కూడా తెలియని వాళ్ళను అతనిపై ఎలా ప్రాధాన్యత ఇవ్వగలరు!? వీరిని వదిలి వాళ్ళను ఎలా దైవప్రవక్త[స.అ] యొక్క ఉత్తరాధికారులుగా, ఖలీఫాగా ఎన్నుకోగలరు!!.
రిఫరెన్స్
తారీఖె దమిష్కె ఇబ్నె అసాకిర్, భాగం2, పేజీ 488. కునూజుల్ హఖాయఖె మునాది, పేజీ 203. కన్జుల్ ఉమ్మాల్, భాగం 5, పేజీ 33.
వ్యాఖ్యానించండి