దైవప్రవక్త[స.అ] ఆజ్ఞ పట్ల ఖాలిద్ బిన్ వలీద్ వ్యతిరేకత

బుధ, 02/26/2020 - 17:42

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఓ అల్లాహ్! నేను ఖాలిద్ చేసిన పనిని వ్యతిరేకిస్తున్నాను”

దైవప్రవక్త[స.అ] ఆజ్ఞ పట్ల ఖాలిద్ బిన్ వలీద్ వ్యతిరేకత

ఖాలిద్ బిన్ వలీద్ యొక్క ఒక సంఘటన దైవప్రవక్త[స.అ] జీవితంలో కూడా సంభవించింది. దైవప్రవక్త[స.అ], అతనిని “బనీ జజీమహ్” వద్దకు ఇస్లాం స్వీకరణ పిలుపుకు పంపినప్పుడు ఎటువంటి యుధ్ధఆజ్ఞ ఇవ్వలేదు. కాని వాళ్ళు సరిగా ఇస్లాం స్వీకారాన్ని వ్యక్తం చేయలేకపోయే సరికి ఖాలిద్ వాళ్ళను చంపడం, బంధించడం మొదలు పెట్టాడు. మరి బంధించిన వారందరిని చంపేయమని తన అనుచరులకు ఆదేశించాడు. వాళ్ళలో కొందరు, వాళ్ళు ఇస్లాంను స్వీకరించారని చంపడం సరికాదని ఖాలిద్ ఆజ్ఞను నిరాకరించి తిరిగి వచ్చి దైవప్రవక్త[స.అ]కు ఫిర్యాదు చేశారు. అందుకు దైవప్రవక్త[స.అ] “ఓ అల్లాహ్! నేను ఖాలిద్ చేసిన పనిని విరోధిస్తున్నాను” అని అన్నారు.[సహీ బుఖారీ, భాగం4, పేజీ171, బాబొ ఇజా ఖజల్ హాకిమ్ బెజౌరిన్]
ఆ తరువాత హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]ను పంపించి చనిపోయిన వాళ్ళకు రక్తమూల్యమును చెల్లించారు. అలాగే వాళ్ళ నష్టపరిహారాన్ని కూడా చెల్లించారు. దైవప్రవక్త[స.అ] కాబా వైపుకు తిరిగి రెండు చేతులను ఆకాశం వైపు ఎత్తి ఇలా అభియోగించారు: “ఓ అల్లాహ్! నేను ఖాలిద్ చేసే పనులతో అసహ్యుఁడను”.[సీరతె ఇబ్నె హిషామ్, భాగం 4, పేజీ 53]

రిఫరెన్స్
సహీ బుఖారీ, భాగం4, పేజీ171, బాబొ ఇజా ఖజల్ హాకిమ్ బెజౌరిన్; సీరతె ఇబ్నె హిషామ్, భాగం 4, పేజీ 53. తబఖాతె ఇబ్నె హిషామ్, అసదుల్ గాబహ్, భాగం3, పేజీ 102.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14