ఇతరులను ఎగతాళి చేయటం

శుక్ర, 02/28/2020 - 15:31

ఇతరులను ఎగతాళి చేయటమనేది మహాపాపం.అలా చేసే వారు ఈ లోకంలో శిక్షను పొందకపోయినా ప్రళయదినాన అల్లాహ్ విధించే శిక్ష నుండి తప్పించుకోలేరు.

ఎగతాళి చేయటం,పాపము,దుర్మార్గులు.

మానవుడు ఒక సంఘజీవి.ఒక సంఘజీవిగా జీవించే మానవుడు ఆచరించవలసిన నియమాలు మరియు కొన్ని అకృత్యాలు[చేయకూడని పనులు] అనేవి వుంటాయి.అలాంటి అకృత్యాలలో ఒకటి ఇతరులను ఎగతాళి చేయటం.దీనిని ఇస్లాము తీవ్రంగా ఖండిస్తుంది.దైవవాణిలో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: “ఓ విశ్వాసులారా! పురుషులు సాటి పురుషులను ఎగతాలి చేయకూడదు.బహుసా వీరికంటే వారే ఉత్తములై ఉండవచ్చు.అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహాసించరాదు ఎందుకంటే బహుశా వీరి కంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు.ఒకరినొకరు ఎత్తిపొడుచుకోకండి.ఒండొకరికి చెడ్డబిరుదులు ఇచ్చుకోకండి.విశ్వసించిన తరువాత తన సోదరుణ్ణి చెడ్డపేరుతో అవమానిచటం చాలా పాపం! మరెవరైతే పశ్చత్తాపం చెందరో[ఈ ధోరణి మానుకోరో] వారే దుర్మార్గులు” [అల్ హుజురాత్/11]. ఇతరులను ఎగతాళి చేయటమనేది ఇతరుల ప్రవర్తన పట్ల సరైన అవగాహన లేకపోవటం,వారిపట్ల ఉన్న ద్వేషం లేదా తమను తాము గొప్పగా భావించే స్వభావం కలిగి ఉండటం వలన కలుగుతుంది.ఏమైతేనేమి ఇతరులను పరిహాసించేవాడు తాను కూడా ఒక రోజు ఇతరుల ద్వారా ఎగతాళి చేయబడతాడని గుర్తుంచుకోవాలి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6