ఖుర్ఆన్ ఉపదేశాలు అర్ధం కాకపోవడానికి కారణం మనం చేసుకునే పాపములు అవి మనకు మరియు ఖుర్ఆన్ జ్ఞానానికి మధ్య అడ్డుగోడలాంటివి.
ఖుర్ఆన్ ను అర్థం చేసుకోవాలంటే మనల్ని మేము పాపముల నుండి దూరంగా ఉంచుకోవాలి, అప్పుడే మనకు ఖుర్ఆన్ ఉపదేశాలు అర్థమౌతాయి. మనల్ని పాపములు చుట్టిముట్టి ఉన్నంత కాలం ఖుర్ఆన్ అర్ధం కాదు. ఖుర్ఆన్ కు మరియు మనకు మధ్య మనం ఎన్ని పాపములు చేశామో అన్ని పరదాలు ఉంటాయి. మేము ఎంత పాపములలో ఉన్న రుచులలో నిమగ్నమై ఉంటే అంత ఖుర్ఆన్ ఉపదేశాలలో ఉన్న రుచి నుండి దూరమై ఉంటాము. అల్లాహ్ ఖుర్ఆన్ లో చాలా స్పష్టంగా ఇలా వివరించెను: “వక్రంగా ఉండటంతో, అల్లాహ్ వారి హృదయాలు వంకరగానే ఉండేలా చేశాడు. అవిధేయ జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు”[సఫ్:5]. ఖుర్ఆన్ తరపు నుండి ఎటువంటి అడ్డంకులు లేవు మన పాపాలే మనకు ఖుర్ఆన్ ఆదేశాలను అర్ధం చేసుకోవడానికి అడ్డు.
గర్వం, పీనాసితనం, చాడీలు చెప్పడం, కపటవర్తనం మొ... లాంటివన్నీ అడ్డంకులే....
వ్యాఖ్యానించండి