.దైవప్రవక్త[స.అ] యొక్క రెండవ ఉత్తరాధికారి ఇమామ్ హసన్[అ.స] గురించి సంక్షిప్తంగా.
పదవీ: రెండవ ఇమామ్(దైవప్రవక్త[స.అ] యొక్క రెండవ ఉత్తరాధికారి)
పేరు: ఇమామ్ హసన్[అ.స]
కున్నియత్: అబూ ముహమ్మద్.
బిరుదు: ముజ్‌తబా.
తండ్రి పేరు: ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]
తల్లి పేరు: ఫాతిమ బింతె ముహమ్మద్[అ.స]
జన్మదినం: రమజాన్ నెల 15వ తారీఖు, హిజ్రీ యొక్క 3వ ఏట.
జన్మస్థలం: మదీనహ్.
వయస్సు: 47 సంవత్సరాలు.
హంతకుడు: జోదా బింతె అష్‌అస్ బిన్ ఖైస్.
మరణం: సఫర్ నెల 28 వ తారీఖు, హిజ్రీ యొక్క 50వ ఏట.
మరణస్థలం: మదీనహ్.
సమాధి: జన్నతుల్ బఖీ(మదీనా).[ముంతహల్ ఆమాల్, ఇమామ హసన్ కు సంబంధించిన అధ్యాయం]
దైవప్రవక్త యొక్క ప్రియమైన మనుమడైన ఈ ఇమామ్ యొక్క సమాధి పై ఉన్న గోపురాన్ని కొంతమంది కపటవర్తనులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆ జన్నతుల్ బఖీ స్మశానంలో అతని సమాధితో పాటు మరో ముగ్గురు ఇమాముల సమాధులు కూడా అక్కడే ఉన్నాయి. మరి దైవప్రవక్త[స.అ] కుమార్తే హజ్రత్ ఫాతెమా జహ్రా[అ.స] సమాధి కూడా అక్కడే ఉంది.
రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, ఇమామ హసన్[అ.స]కు సంబంధించిన అధ్యాయం.
వ్యాఖ్యానించండి