పవిత్ర మాసూమ్[అ.స] వచనానుసారం “ హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ[అ.స] సమాధి దర్శనం ఇమామ్ హుసైన్[అ.స] సమాధి దర్శనంతో సమానం”
పవిత్ర ఇమాముల ప్రముఖ సహాబీయులలో ఒకరు హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ[అ.స]. ఇతను ఇమామ్ అలీ రిజా[అ.స], ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] మరియు ఇమామ్ అలీ నఖీ[అ.స]ల సహాబీయులలో లెక్కించబడతారు. వారు ఇతనిని చాలా ప్రశంసించేవారు. హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ[అ.స] ఇమామ్ హసన్[అ.స] యొక్క మనమల నుండి ఒకరు. ఇతను హిజ్రీ యొక్క 173వ సంవత్సరంలో రబీవుల్ అవ్వల్ యొక్క 4వ తారీఖున మదీనహ్ పట్టణంలో జన్మించారు. ఇతను ధర్మనిష్ట, విధేయత కలిగిఉండటంతో పాటు మంచి జ్ఞానం గలవారు. ఇతను ఇమామ్ అలీ నఖీ[అ.స] కాలంలో ఇమామ్ యొక్క ఆజ్ఞానుసారం ఇరాన్ ప్రజల హిదాయత్ కోసం వలసపోయి ఇప్పటి టహ్రాన్ పట్టణానికి దగ్గర ఉన్న “రయ్” పట్టణాన్ని నివాసంగా ఎంచుకున్నారు. “రయ్” పట్టణానికి హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ[అ.స] యొక్క రాక ద్వార ఆ పట్టణంలో షియాలు ఉండేవారని మరియు షియా విశ్వాసాల ప్రచారం కోసం మంచి అవకాశం లభించిందని తెలుస్తుంది. దాదాపు హిజ్రీ యొక్క 250వ ఏట హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ[అ.స] దుర్మార్గుల చేత చంపబడ్డారు. ఇప్పుడు అతని సమాధి రయ్ పట్టణంలోనే ఉంది. పవిత్ర మాసూమ్[అ.స] వచనానుసారం “అతని సమాధి దర్శనం ఇమామ్ హుసైన్[అ.స] సమాధి దర్శనంతో సమానం”.
వ్యాఖ్యానించండి