ఇతరులను ఎగతాళి చేయటానికి గల కారణాలు

శుక్ర, 02/28/2020 - 18:55

మానవుడు ఇతరులను ఎగతాళి చేయటానికి గల కారణాలు దివ్యఖురాను దృష్టిలో.

ఎగతాళి చేయటం,కారణాలు,పాపము.

ఇతరులను ఎగతాళి చేయటమనేది బయటకు ఒక పాపమే కానీ నిజంగా అది ఎన్నొ పాపాల యొక్క కలయిక వాటిలో కొన్ని: ఇతరులను అగౌరవపరచటం,కించపరచటం,ఇతరులలో లోపాలను వెతకటం,చాడీలు చెప్పటం మొదలైనవి.కానీ చాడీలు చెప్పటానికి కారణాలేమిటి?అనే ప్రశ్నకు దివ్యఖురాను కొన్ని కారణాల్ను ప్రస్థావిస్తుంది.ఒకటి, సిరిసంపదల వల్ల మనిషి ఇతరులను ఎగతాలి చేస్తాడు. దైవవాణి ఈ విధంగా సెలవిస్తుంది: “[ఇతరుల] తప్పులెన్నుతూ,పరోక్ష నిందకు పాల్పడే ప్రతీ ఒక్కడికి మూడుతుంది,వాడు ధనాన్ని పోగు చేసి,పదే పదే లెక్కపెడుతూ ఉంటాడు” [అల్ హుమజహ్/1,2]. ఒక్కోసారి ఈ ఎగతాళికి కారణం మనిషి వద్ద ఉన్న జ్ఞానం లేదా విద్య.దివ్యఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: “వారి వద్దకు ప్రవక్తలు ఎప్పుడు స్పష్టమైన సూచనలు తీసుకువచ్చినా తమ వద్ద ఉన్న విద్య ఆధారంగా వారు వికట్టాట హాసం చేసేవారు.వారు దేనిని పరిహాసించేవారో ఎట్టకేలకు అదే వారిపై విరుచుకుపడింది” [అల్ గాఫిర్/83]. తన వద్ద ఉన్న బలాన్ని చూసుకొని కూడా మానవుడు ఇతరులను ఎగతాళి చేస్తాడు.దివ్యఖురాను ఈ విధంగా సెలవిస్తుంది: “ఆద్[జాతి వారి] విషయానికి వస్తే,వారు ఏ హక్కూ లేకుండానే భువిలో చెలరేగిపోయారు."బలపరాక్రమాలలో మాకన్నా మొనగాడెవడున్నాడు? అని [బీరాలు] పలికారు.తమను పుట్టించిన అల్లాహ్ తమకన్నా ఎంతో బలవంతుడన్న సంగతి వారికి స్ఫుర్తించలేదా?” [అల్ ఫుస్సిలత్/15]. సాకులు చెప్పటం మరియు మోసం చేయటం కూడా దివ్యఖురాను దృష్టిలో ఇతరులను ఎగతాళి చేయటానికి ఒక కారణంగా చెప్పవచ్చు: విశాలమనస్సుతో దానధర్మాలు చేసే విశ్వాసులను నిందించే వారిని [అల్లాహ్ మార్గంలో ఇచ్చేందుకు] తాము చెమటోడ్చి సంపాదించినది తప్ప మరేదీ తమ వద్ద లేని వారిని అవహేళన చేస్తూ మాట్లాడేవారిని అల్లాహ్ కూడా ఆటపట్టిస్తాడు.వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది [అత్ తౌబా/79].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27