అల్లాహ్ ఎన్నికలు

ఆది, 03/01/2020 - 11:20

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం ప్రకారం అల్లాహ్ ప్రతి వాటి నుండి నాలుగు వాటి (నమూలుగా) ఎన్నుకున్నాడు..

అల్లాహ్ ఎన్నికలు

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: అల్లాహ్ ప్రతి వాటి నుండి నాలుగు వాటి (నమూలుగా) ఎన్నుకున్నాడు..
దైవదూతల నుండి జిబ్రయీల్, మీకాయీల్, ఇస్రాఫీల్ మరియు ఇజ్రాయీల్[అ.స] లను ఎన్నుకునెను.
దైవప్రవక్తల నుండి నలుగురిని జిహాద్ కై ఎన్నుకునెను; ఇబ్రహీమ్, దావూద్, మూసా మరియు నేను.
వంశాల నుండి నాలుగు వంశాలు ఎన్నుకొని ఇలా ప్రవచించెను; “ఆదమ్, నూహ్ మరియు ఇబ్రాహీమ్ వంశస్తులను మరియ ఇమ్రాన్ వంశస్తులను ఎన్నుకునెను”.
పట్టణాలలో నాలుగు పట్టణాలను ఎన్నుకునెను; మదీనహ్, బైతుల్ ముఖద్దస్, కూఫా మరియు మక్కా.
స్ర్తీల నుండి నలుగురు స్ర్తీలను ఎన్నుకునెను; మర్యమ్, ఆసియా, ఖదీజహ్ మరియు ఫాతెమా.
హజ్ ఆమాలులో నాలుగు వాటిని ఎన్నుకునెను; సజ్(ఖుర్బానీ), అజ్(లైబైక్ అని చెప్పటం), ఎహ్రామ్(ప్రత్యేక దుస్తులు ధరించటం) తవాఫ్(ప్రదక్షణాలు).
మాసాలలో నాలుగు మాసాలు ఎన్నుకునెను; రజబ్, షవ్వాల్, జిల్ ఖఅదహ్ మరియు జిల్ హిజ్జహ్.
రోజులలో నాలుగు రోజులు ఎన్నుకునెను; శుక్రవారం, తర్వీహ్(జిల్ హిజ్జహ్ యొక్క 8వ లేదీ), అరఫహ్ రోజు మరియు ఖుర్బానీ రోజు.[బిహారుల్ అన్వార్, భాగం60, పేజీ205]

రిఫరెన్స్
మజ్లిసీ, బిహారుల్ అన్వార్, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 37