ఆది, 03/01/2020 - 11:28
రజబ్ మాసంలో అల్లాహ్ కారుణ్యం కురుస్తుంది అని వివరించే దైవప్రవక్త[స.అ] హదీస్..
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
అల్లామా ముహమ్మద్ బాఖిర్ మజ్లిసీ తన హదీస్ గ్రంథం “బిహారుల్ అన్వార్” లో ఇలా హదీస్ ఉల్లేఖించెను: రజబ్ మాసం రాగానే దైవప్రవక్త[స.అ] ముస్లిములను సంగ్రహించి ఉపన్యాసమిచ్చేవారు... వారు ఇలా ప్రవచించేవారు: ముస్లిములారా! చాలా గొప్ప మరియు మంచి మాసం మిమ్మల్ని తన నీడతో కమ్ముకుంది, ఈ నెల, కురిసే నెల. అల్లాహ్ ఈ నెలలో తన కారుణ్యాన్ని తన దాసులపై కురిపిస్తాడు, బహుదైవారాధకుడు మరియు ఇస్లాంలో కొత్త కొత్త పద్ధతులను సృష్టించిన వారి పై తప్ప. [బిహారుల్ అన్వార్, భాగం97, పేజీ47]
రిఫరెన్స్
మజ్లిసీ, బిహారుల్ అన్వార్, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి