.ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] యొక్క కుమారుడైన జనాబె మూసా ముబ్రఖా గురించి సంక్షిప్త వివరణ.
జనాబె మూసా ముబ్రఖా ఇతను ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] యొక్క కుమారుడు. ఇతని కున్నియత్ అబూజాఫర్, బిరుదు ముబ్రఖా, ఎందుకంటే ఇతని అతి సౌదర్యం వల్ల ఇతను ముసుగులో ఉండేవారు. ఇతను హిజ్రీ యొక్క రెండవ 292వ ఏట రబీవుస్సానీ నెల 22వ తారీఖున(మరో ఉల్లేఖనం ప్రకారం రబీవుస్సానీ 8వ తారీఖున, మరో ఉల్లేఖనం ప్రకారం రబీవుస్సానీ 8వ తారీఖున) ఇరాన్ యొక్క పట్టణం ఖుమ్ లో మరణించారు. ఇతని సమాధి ఖుమ్ లో “చెహెల్ అఖ్తరాన్” అనబడే చోట ఉంది. ఇతను హిజ్రీ యొక్క 256వ సంవత్సరంలో ఖుమ్ పట్టణానికి వచ్చిన ఇమామ్ రిజా[అ.స] సంతానం నుండి మొదటి వారు. ఖుమ్ లో ఉండే అరబ్ కు చెందిన వారు ఇతనిని ఖుమ్ నుండి బయటకు పంపేశారు, ఇతను కాషాన్ కు వెళ్ళిపోయారు, అక్కడ అతనిని చాలా గౌరవించేవారు.
అబూ సుదైమ్ హుసైన్ ఇబ్నె అలీ ఇబ్నె ఆదమ్ మరియు ఖుమ్ యొక్క పెద్దమనుషులలో ఒకరి రాకతో ఖుమ్ లో ఉండే అరబులకు ముసా ముబ్రఖా ఎవరో తెలిసొచ్చింది, అప్పుడు అతనిని ఖుమ్ కు తిరిగి తీసుకొచ్చారు, అతను ఉండేందుకు ఇల్లును సిద్ధం చేశారు, అలాగే అతని కోసం పలు గ్రామాలలో భూములు మరియు తోటలు కొన్నారు. అతని చెల్లెళ్ళు మరియు ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] కుమార్తెలైన జైనబ్, ఉమ్మె ముహమ్మద్ మరియు మైమూనహ్ కూడా ఖుమ్ కు వచ్చి అతని వద్దకే వచ్చారు.
మూసా మబ్రఖా మరణాంతరం అతని జనాజా నమాజ్ ను ఖుమ్ యొక్క పెద్ద అబ్బాస్ ఇబ్నె అమ్రె గనవీ చదివించారు. ముహమ్మద్ ఇబ్నె హసన్ ఇబ్నె అబీ ఖాలిదె అష్అరీ(షన్బులహ్ బిరుదు గలవారు) ఇంట్లో సమాధి చేశారు. సరైన రావీయుల క్రమంతో, కులైనీ[ర.అ] ఉల్లేఖన ప్రకారం జనాబె మూసా ముబ్రఖా, ఇమామ్ తరపు నుండి ఔఖాఫ్ ధర్మకర్తగా నియమించబడ్డారు.[అల్ కాఫీ, భాగం1, పేజీ261].
రిఫ్రెన్స్
మర్హూమ్ కులైనీ, అల్ కాఫీ, భాగం1, పేజీ261.
వ్యాఖ్యానించండి