దైవప్రవక్త ముహమ్మద్[స.అ] తమ పూర్వీకుల గురించి ఇలా అనెను: నా వంశవృక్షం క్రమంలో అద్నాన్ వరకు చేరితే అక్కడితో అగిపోండి. ఈ హదీస్ ద్వార అంతకు మించి పరిశోధన అవసరం లేదు అని మనకు తెలుస్తుంది.
దైవప్రవక్త[స.అ] తమ పూర్వీకుల గురించి ఇలా అనెను:
اِذا بَلغَ نَسَبی اِلی عدنان فَامسِکوا
అనువాదం: నా వంశవృక్షం క్రమంలో అద్నాన్ వరకు చేరితే అక్కడితో అగిపోండి.
అందు వలన మనం జనాబె అద్నాన్[అ.స]తో మొదలు పెడదాం:
జనాబె అద్నాన్[అ.స] కొన్ని ఐక్యకుటుంబాల అధినేతగా ఉండేవారు. “బుక్తున్నస్‌ర్” అనే రాజు వీరిపై దాది చేసాడు. ఆ దాడి జరిగిన తరువాత అతను తన సంతానంతో “యమన్” వైపు వెళ్ళి “మామన్” అనే ఊరిలో జీవనం సాగించి అక్కడె మృతి చెందారు. జనాబె అద్నాన్[అ.స]కు పది(10) మంది కుమారులు వారిలో కొందరి పేర్లు: మఅద్, అక్కా, అద్‌న్, అద్, మరియు గనీ. దైవప్రవక్త ముహమ్మద్[స.అ] యొక్క దివ్యతేజస్సు జనాబె అద్నాన్[అ.స] నుండి జనాబె మఅద్[అ.స]లో మిళితం అయ్యింది.[బిహారుల్ అన్వార్, భాగం15, పేజీ105; భాగం108, పేజీ203]
రిప్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం15, పేజీ105; భాగం108, పేజీ203.
వ్యాఖ్యానించండి