వంచకుని యొక్క నాలుగు లక్షణాలు ఇమాం అలి[అ.స] ల వారి హదీసు అనుసారంగా.
వంచకుడు బాహ్యంగా అతను ఒక మంచి లక్షణాలు కలవానిగా తనను తాను చూపించటానికి ప్రయత్నిస్తాడు కానీ అంతర్గతంగా చూస్తే అతనిలో చెడు లక్షణాలన్ని దొరుకుతాయి కానీ ఒక వంచకునిని గుర్తించటమెలా? అనే ప్రశ్న సహజంగా కలుగుతుంది.దానికి జవాబుగా ఇమాం అలి[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: వంచకునికి నాలుగు లక్షణాలు కలవు: 1.తాను ఒంటరిగా ఉన్నప్పుడు భగవంతుని ప్రార్ధన,ఆయన స్థుతి మరియు మంచి కార్యాల పట్ల బద్దకం వహిస్తాడు.2.ప్రజలలో ఉన్నప్పుడు ఆ దేవుని ప్రార్ధనకు, ఆయన స్తుతి మరియు మంచి కార్యాల పట్ల కష్టపడటానికి ప్రయత్నిస్తాడు.3.తన కార్యల పట్ల ఇతరులు ప్రశంసిస్తే ఎక్కువ [మంచి కార్యాలు] చేస్తాడు.4.ఎప్పుడైతే ఇతరుల తన మంచి పనులను ప్రశంసించరో వాటిని చేయటం మానెస్తాడు.
రెఫరెన్స్: నసాయెహ్,అయతుల్లాహ్ అలి మిష్కీని,పేజీ నం:187.
వ్యాఖ్యానించండి