శుక్ర, 02/01/2019 - 20:41
విశ్వాసునికి గల ఏడు లక్షణాలు ఇమాం సాదిఖ్[అ.స]ల వారి ద్రుష్టిలో.
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా ప్రవచించారు: విశ్వాసుడు తప్పనిసరిగా ఈ ఏడు లక్షణాలను కలిగి ఉండాలి,అవి:
1.ఆపదలు మరియు క్లిష్ట పరిస్తితులలో వాటికి ఎదురుగా నిలవడం(స్ఠిరంగా ఉండటం).
2.కష్టమైన లేదా పరీక్ష సమయంలో సహనాన్ని పాఠించడం.
3.సుఖవంతమైన జీవితంలో ఆ అల్లాహ్ కు క్రుతజ్ఞులై ఉండటం.
4.ఆ అల్లహ్ నుండి లభించిన దానితో సంతృప్తి పడటం.
5.శత్రువులు మరియు విరోధులపై దౌర్జన్యానికి పాల్పడకుండా ఉండటం.
6.మిత్రులపై పనుల భారాన్ని మోపకుండా ఉండటం.
7.తనకు తాను కష్టబడేవాడు కానీ అతని వలన అతని స్నేహితులు మాత్రం సుఖభరితమైన జీవితాన్ని గడుపుతారు(తన సుఖాన్ని తన మిత్రులపై ధారబోసేవాడు).
రెఫరెన్స్:
ఉసూలే కాఫీ, 2వ భాగం,పేజీ నం: 47.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి