ఇతరుల అవసరాలను తీర్చటం మాసూముల హదీసులలో

ఆది, 04/12/2020 - 17:37

ప్రజల అవసరాలను తీర్చటానికి గల ప్రాముఖ్యతను వివరించే మాసూముల కొన్ని హదీసులు.

అవసరాలు,దైవప్రవక్త,కడుపు నింపటం.

1.దైవప్రవక్త[స.అ.వ] ఈ విధంగా ఉల్లేఖించారు: దేవుని దృష్టిలో అతి ఉత్తమ పనులు దాహంతో మాడిపోతున్న హృదయాలను చల్లబరచటం,ఆకలితో ఉన్న వారి కడుపులను నింపటం.ఎవరి చేతిలో అయితే మొహమ్మద్[స.అ.వ] యొక్క ప్రాణాలున్నయో అతనిపై ప్రమాణం చేసి చెబుతున్నాను,ఎవరైతే కడుపు నిండా తిని నిద్రపోతాడో అలాంటప్పుడు అతని సోదరుడు లేదా అతని పొరుగువాడు ఆకలితో ఉండిపోతాడో ఆ వ్యక్తి నాపై విశ్వాసము లేని వాడు [ఆమాలియె తూసి,2వ భాగం,పేజీ నం:211].

2.వేరొక చోట దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఎవరైతే విశ్వాసుడైన తన సోదరుని యొక్క సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తాడో అతడు తొమ్మిది వేల సంవత్సరాలు ఆ భగవంతునిని ప్రార్ధించిన వాడి మాదిరి.ఏ విధంగా నంటే పగటి పూట ఉపవాసముండి రాత్రంతా ప్రార్ధనలో గడిపిన వాడి మాదిరి [బిహారుల్ అన్వార్,71 వ భాగం,పేజీ నం:315].

3.ఇమాం హుస్సైన్[అ.స] ల వారు  ఈ విధంగా సెలవిస్తున్నారు: ఎవరైతే విశ్వాసులలో ఒకరి యొక్క దుఖ్ఖాన్ని తొలగిస్తారో సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడు అతని ఈ లోకపు మరియు పరలోకపు దుఖ్ఖాలను తొలగిస్తాడు[అతని సమస్యలను పరిష్కరిస్తాడు] [కష్ఫుల్ ఘుమ్మ,2వ భాగం,పేజీ నం:29].

4. ఇమాం కాజిం[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: నిశ్చితంగా ఈ భూమిలో ప్రజల అవసరాలు తీర్చుటకు ఆ అల్లాహ్ దాసులున్నారు.వారు[ఆ దాసులు] ప్రళయ దినాన [ఆ భగవంతుని] శరణులో ఉంటారు [అల్ కాఫి,2వ భాగం,పేజీ నం:197].

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13