స్వీయనిర్బంధానికి దైవప్రవక్త[స.అ.వ] ల వారి తాకీదు

సోమ, 04/13/2020 - 12:48

కరొనా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్ లు వ్యాప్తి చెంది ఎంతోమందిని పొట్టనపెట్టుకున్నప్పుడు అది ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఇంటికి పరిమితమై ఉండటమే పరిష్కారమని ఇస్లాములో 1400 సంవత్సరాల ముందే తాకీదు చేయటం జరిగింది. 

కరొనా, స్వీయనిర్భందం, తాకీదు.

ప్రపంచం మొత్తాన్ని ఈ రోజు వణికిస్తున్న కరొనా వైరస్ కు ప్రస్తుతం వ్యాక్సిన్ లేదని చెబుతున్నారు.మరి దానిని కట్టడి చేయటం ఎలాగని ప్రశ్నిస్తే ఇంటికి పరిమితమై ఉండటమే దానికి పరిష్కారమని వైద్యులు చెబుతున్నారు.ఈ కరొనా వైరస్ మాత్రమే కాదు చరిత్రలో ఇలాంటి చాలా  ప్రమాదకరమైనా వ్యాదులు వచ్చినప్పుడు వాటికి కూడా పరిష్కారం కేవలం స్వీయ గృహనిర్భందమే అని చరిత్ర చెబుతుంది.ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇస్లాము ఏం చేయమని చెబుతుంది? అని ప్రశ్నిస్తే దానికి దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఒక హదీసులో సమాధానం దొరుకుతుంది.ఆ హదీసులో మహనీయ ప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: ఒక వేళ ప్లేగు[లేదా ఏ ప్రమాదకరమైన వ్యాది అయిన] వచ్చి మానవుడు తానుంటున్న ప్రదేశానికే పరిమితమై ఉండి,ఆ భగవంతుని కొరకు సహనాన్ని పాఠించి ఆ దేవుడు తనకోసం ఏదైతే ఖరారు చేసాడో అది తప్ప ఏదీ తన వద్దకు చేరదని విశ్వసిస్తాడో,ఇలాంటి వ్యక్తిని ఆ భగవంతుడు ఆ దేవుని మార్గంలో అమరుడైన వ్యక్తి యొక్క ప్రతిఫలాన్ని ఇస్తాడు.

రెఫరెన్స్: కంజుల్ ఉమ్మాల్,ముత్తఖీయె హిందీ,10వ భాగం,పేజీ నం:77.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16