రోగుల సేవకు ప్రతిఫలం

ఆది, 04/12/2020 - 11:25

రోగుల సేవకు ఆ భగవంతుడు ఏ ప్రతిఫలాన్ని ఇస్తాడన్న ప్రశ్నకు మాసూముల హదీసుల ద్వారా జవాబు.

సేవ,దైవప్రవక్త,ప్రతిఫలం.

ఆ దేవుని యొక్క నిజమైన దాసులు ఏ పని చేసిన ఆ భగవంతుని కోసమే చేసి తద్వారా ఆ భగవంతునికి దగ్గర కావాలని తాపత్రయపడుతూ ఉంటారు.నిజంగా ఏ పని ద్వారా ఆ భగవంతునికి దగ్గర కావచ్చు? అనే ప్రశ్న మనకూ కలుగుతూ ఉంటుంది.ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే అలాంటి పనులు చాలా ఉన్నాయి అలాంటి వాటిలో రోగులకు సేవ చేయటం కూడా ఒక్కటి.ఈ రోజు ప్రపంచాన్ని వణికిస్తూ,ప్రజల ప్రాణాలు తీస్తున్న ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి మనుష్యులు ఒకరికొకరు సహాయపడటం కూడా అవసరం.ఈ రోగం యొక్క బారిన పడిన వారికి సహాయపడటం కేవలం వైద్యుల కర్తవ్యం కాదు,సాటి మనిషిగా అది మన కర్తవ్యం కూడాను.సమస్త మానవాళికి ఇస్లాము కూడా ఇదే సందేశాన్నిస్తుంది. దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: ముస్లిముల సమూహానికి సేవ చేసే ప్రతీ ముస్లిముకు ఆ భగవంతుడు స్వర్గంలో అదే సంఖ్యలో సేవకులను నియమింపజేస్తాడు [ఉసూలే కాఫి,బబె ఖిద్మత్ బె మొమినాన్,హదీసు నం:1]. వేరొక హదీసులో ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఎవరైతే రోగుల యొక్క అవసరాలను తీర్చటానికి ప్రయత్నిస్తారో,ఆ అవసరాన్ని తీర్చినా తీర్చకపోయినా,అతను తన పాపాల భారం నుండి బయటకు వస్తాడు[అతని పాపాలు క్షమించబడతాయి],ఏ విధంగా నంటే అతను తన తల్లి కడుపు నుండి అదే రోజు పుట్టిన వాని వలె పరిగణింపబడతాడు [మన్ ల యహ్జరుహుల్ ఫఖీహ్,4వ భాగము,పేజీ నం:14,హదీసు నం: 4968].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13